Arun Lal: 66 ఏండ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్..

Published : Apr 25, 2022, 05:10 PM IST
Arun Lal: 66 ఏండ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్..

సారాంశం

Arun Lal Second Marriage: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం బెంగాల్ రంజీ  జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్  మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయనకు 66 ఏండ్లు. పెళ్లి చేసుకోబోయే  వధువు వయసు... 

గతంలో భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన  మాజీ క్రికెటర్  అరుణ్ లాల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. 66 ఏండ్ల వయసులో.. మొదటి భార్య బ్రతికుండగానే ఆయన  మళ్లీ పెళ్లి పీఠలెక్కబోతున్నారు. చాలా కాలంగా  అరుణ్ లాల్.. బెంగాల్ కు చెందిన బుల్ బుల్ సాహ అనే మహిళ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.  38 ఏండ్ల బుల్ బుల్ సాహను ఇప్పుడు ఆయన తన రెండో జీవిత భాగస్వామిగా చేసుకుంటుడటం గమనార్హం.  వచ్చే నెల (మే) 2న  కోల్కతా  లో వీరి  వివాహం జరుగనుందని పలు స్థానిక వార్తా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. 

ప్రస్తుతం బెంగాల్  రంజీ జట్టుకు హెడ్ కోచ్ గా  వ్యవహరిస్తున్న  అరుణ్ లాల్.. తన మొదటి భార్య రీనా తో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్నా ఆమెకు  ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రస్తుతం ఆమె అరుణ్ లాల్ తోనే జీవిస్తున్నది. బుల్ బుల్ సాహతో పెళ్లికి  రీనా కూడా అంగీకరించిందని సమాచారం. 

ఇప్పటికే  ఈ ఇద్దరి మధ్య ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట. మే 2న కోల్కతాలోని పీర్లెస్ ఇన్ లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు లాల్ ఇప్పటికే  తన కుటుంబసభ్యులు, బెంగాల్ రంజీ జట్టు సభ్యులు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) లకు  ఆహ్వానం కూడా పంపాడు.  అతికొద్ది మంది సమక్షంలో  అరుణ్ లాల్ రెండో సారి పెళ్లి చేసుకోబోతున్నాడు. 

 

వృత్తి రిత్యా ఉపాధ్యాయిని అయిన  బుల్ బుల్.. అరుణ్ లాల్ తో చాలాకాలంగా సన్నిహితంగా ఉంటున్నది. లాల్ మొదటి భార్య రీనాతో కూడా  ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయట. పెళ్లయ్యాక  రీనా ఆరోగ్యం చూసుకోవడానికి బుల్ బుల్ ఒప్పుకున్నదని పలు  బెంగాళీ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. 

కాగా.. భారత్ తరఫున అరుణ్ లాల్ 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. 1982-89 మధ్యకాలంలో  జాతీయ  జట్టుకు ఆడిన  అరుణ్ లాల్.. టెస్టులలో 729 పరుగులు చేశాడు. వన్డేలలో 122 రన్స్  మాత్రమే నమోదు చేశాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించలేకపోయినా  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం అరుణ్ లాల్ మెరుగ్గా ఆడాడు.  156 మ్యాచులాడి.. 10,421 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 287 గా ఉంది. 2016లో ఆయన దవడ క్యాన్సర్ భారీన పడ్డా తిరిగి కోలుకున బెంగాల్ రంజీ జట్టుకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !