రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డ్.. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు..!

Published : Jul 13, 2023, 11:20 AM IST
 రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డ్.. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు..!

సారాంశం

భారత బౌలర్ల దాటికి  విండీస్ జట్టు విలవిలాడింది.  కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది.  టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. 

భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి డొమినికా వేదికగా టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రోజు మ్యాచ్‌కి భారత్ పేరు పెట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కానీ .. భారత బౌలర్ల దాటికి  విండీస్ జట్టు విలవిలాడింది.  కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది.  టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. 

 

కాగా, ఈ మ్యాచ్ లో   భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. టీమిండియా తరఫున కొత్త చరిత్రను సృష్టించాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు తీశాడు. విండీస్ యువ ఓపెనర్ తగెనారాయణ్ చంద్రపాల్ వికెట్ తీయడం ద్వారా అరుదైన మైల్ స్టోన్ ను అశ్విన్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తండ్రిని, తనయుడిని అవుట్ చేసిన తొలి భారత బౌలర్ గా అశ్విన్ రికార్డులకు ఎక్కాడు.

ఇలాంటి అరుదైన ఘనత సాధించినవారిలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ఐదో వాడు కావడం విశేషం. తండ్రి, కొడుకులను అరెస్టు చేసిన ఘనత అశ్విన్ కి దక్కింది. తగెనారాయణ్ చంద్రపాల్ మరెవరో కాదు.. విండీస్ మాజీ ప్లేయర్ శివనారాయణ్ చంద్రపాల్.  తనయుడే తగెనారాయణ్ చంద్రపాల్. గతంలో శివనారాయణ్ చంద్రపాల్ ని అవుట్ చేసిన అశ్విన్ , తాజాగా నిన్నటి మ్యాచ్ లో తగె నారాయణ్  చంద్రపాల్ ని అవుట్ చేశాడు.
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !