అలా చెప్పలేదు, అద్భుతం: న్యూజిలాండ్ పై విజయంపై కోహ్లీ

By telugu teamFirst Published Jan 24, 2020, 8:20 PM IST
Highlights

న్యూజిలాండ్ పై తొలి టీ20లో విజయం సాధించడం అద్భుతమని, పర్యటన మొత్తం తమకు ఇది ఉత్సాహాన్ని ఇస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాము అలసిపోయామని ఎప్పుడూ చెప్పలేదని కోహ్లీ అన్నాడు.

ఆక్లాండ్: తొలి టీ20 మ్యాచులో న్యూజిలాండ్ పై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెగ సంతోషంతో ఉన్నాడు. రెండు రోజుల క్రితమే తాను ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఈ విధంగా ఆడి విజయం సాధించడం అద్భుతమని ఆయన అన్నాడు. అలసిపోయామనే మాట ఎప్పుడూ తాము చెప్పలేదని, అలా చెప్పడాన్ని కోరుకోబోమని ఆయన అన్నాడు. 

న్యూజిలాండ్ పర్యటనను విజయం ప్రారంభించడం ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు. తమ ముందున్న లక్ష్యం కేవలం విజయం సాధించడమేనని ఆయన అన్నాడు. ఏడాది కాలంగా భారత జట్టు టీ20ల్లో రాటుదేలిందని చెప్పాడు.

Also Read: అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్: సేమ్ టు సేమ్@4

ఈ పిచ్ పరుగులు చేయడానికి కష్టమైంది కాది, న్యూజిలాండ్ తమకు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని అంచనా వేసుకున్నామని, అయితే అంతకన్నా తక్కువ పరగులకే కట్టడి చేయగలిగామని అన్నాడు. 

ఆస్ట్రేలియాలో సిరీస్ ను తాము ఉత్తమంగా ముగించామని, ఆ విశ్వాసంతో ఇక్కడ ఆడామని, మిడిల్ ఓవర్లలో తాము బాగా ఆడామని, న్యూజిలాండ్ ను 210 పరుగుల లోపల కట్టడి చేయగలిగామని అన్నాడు. 

Also Read: ఆక్లాండ్ టీ20: ఇన్నింగ్స్‌కే హైలెట్ ఆ షాట్, ధోనిని గుర్తుకు తెచ్చిన రాహుల్

ఓ దశలో తాము కీలక వికెట్లను కోల్పోయామని, దాంతో మంచి భాగస్వామ్యం నెలకొల్పే లక్ష్యంతో బ్యాటింగ్ చేశానని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్  అన్నాడు. ఇది చాలా చిన్న మైదానమని, దాంతో పరుగులు చేస్తూనే వచ్చామని, దాంతో 204 పరుగుల లక్ష్యం భారీగా కనిపించలేదని ఆయన అన్నాడు.  

click me!