బుమ్రాను రిప్లేస్ చేసే బౌలర్ అతడే.. ముంబై ఇండియన్స్‌కు ఫ్యాన్స్ కీలక సూచన

Published : Feb 27, 2023, 02:59 PM IST
బుమ్రాను రిప్లేస్ చేసే బౌలర్ అతడే.. ముంబై ఇండియన్స్‌కు  ఫ్యాన్స్ కీలక సూచన

సారాంశం

Jasprit Bumrah: బుమ్రా ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడని, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకుని అతడిని ఐపీఎల్ కు పక్కనబెట్టడమే బెటర్ అనే భావనలో  బీసీసీఐ ఉంది. ఈ నేపథ్యంలో.... 

టీమిండియా  పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గత ఏడెనిమిది నెలలుగా  క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.   ఈ ఏడాది జనవరిలో అతడు  భారత జట్టులో చోటు దక్కించుకున్నా  శ్రీలంకతో వన్డే సిరీస్ ముందు  మళ్లీ గాయంతో అతడిని తప్పించారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని భావించినా  అదీ జరగలేదు. కాగా తాజా రిపోర్టుల ప్రకారం  బుమ్రా  వచ్చే నెలలో  జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ -   16 సీజన్ నుంచి కూడా  తప్పుకున్నాడని సమాచారం. 

ఇప్పటికీ   బుమ్రా బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడని, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకుని అతడిని ఐపీఎల్ కు పక్కనబెట్టడమే బెటర్ అనే భావనలో  బీసీసీఐ ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు  బుమ్రాను రిప్లేస్ చేసే బౌలర్ ఎవరు..? అన్న చర్చ జరుగుతున్నది. 

ట్విటర్ లో ఇదే విషయమై  పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రా స్థానంలో  బాలీవుడ్ వెటరన్ నటుడు  బాబీ డియోల్ ను ఆడించాలని, అతడే ముంబై ఇండియన్స్ కు సరైన న్యాయం చేయగలడని ఫన్నీగా  స్పందిస్తున్నారు.   ‘బుమ్రాను రిప్లేస్ చేసేది లార్డ్ బాబీ డియోల్ మాత్రమే..’, ‘బుమ్రాకి జాగా  బాబీ డియోల్ కే లేలూ (ఇవ్వండి)’, ‘లార్డ్ బాబీ డియోల్ మాత్రమే బుమ్రా స్థానాన్ని అటు ముంబై ఇండియన్స్ తో పాటు  టీమిండియాలో కూడా  భర్తీ చేయగలడు..’అంటూ అతడు బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తున్నారు. 

 

 

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) లో భాగంగా బాబీ డియోల్  బౌలింగ్ చేస్తున్న వీడియోలు, ఫన్నీ మీమ్స్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

కాగా ముంబై గత సీజన్‌లో 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి ముంబైపై భారీ అంచనాలు ఉన్నాయి.. కారణం జోఫ్రా ఆర్చర్, జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ ఈసారి ఆడతారని అంచనాలే. 2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే అతను గాయం కారణంగా గత సీజన్‌లో ఆడలేదు. ఈసారి ఆర్చర్ వస్తాడని, బుమ్రా, అతను కలిసి టీమ్‌కి ఐపీఎల్ టైటిల్ అందిస్తారని ఆశలు పెట్టుకుంది ముంబై. ఐపీఎల్ అయ్యాక వారం రోజుల గ్యాప్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. అయితే నేరుగా ఆ మ్యాచ్ ఆడితే రిథమ్ అందుకోవడం కష్టం. కాబట్టి ఆ సాకుతోనైనా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచుల్లో బుమ్రా ఆడే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !