మాజీ క్రికెటర్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్...గవాస్కర్ ఫోన్ నంబర్ కోసం

By Arun Kumar PFirst Published Aug 28, 2019, 7:56 PM IST
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో వున్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.  

టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో కొందరు ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. అలా తన పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి వాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ...తాను ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లను వాడటంలేదని స్పష్టం చేశారు. నా పేరుతో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ వున్నట్లు ఇటీవలే నా దృష్టికి వచ్చింది. అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సందీప్ పాటిల్  తెలిపారు. 

ఇటీవల స్నేహితుడొకరికి తన పేరుతో ఓ ఫేస్ బుక్ అకౌంట్ నుండి ప్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందట. నిజంగానే అది పంపింది తానే అనుకుని అతడు దాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి కొందరు బిసిసిఐ అధికారులు, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, డయానా ఎడుల్జీ ఫోన్ నంబర్లు అడిగాడట. దీంతో అనుమానం వచ్చిన తన ప్రెండ్ నాకు ఫోన్ చేశాడని...అప్పుడే తనకు ఈ ఫేక్ అకౌంట్స్ గురించి తెలిసిందని సందీప్ వెల్లడించాడు.

ఈ సంఘటన తర్వాత వివిధ సోషల్ మీడియా మాధ్యమాలను పరిశీలిస్తే తన పేరుతో మరికొన్ని ఫేక్ అకౌంట్స్ వున్నట్లు తేలింది. వాటి వల్ల తనకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ముందస్తుగానే పోలీసులకు ఫిర్యాదు  చేశానని తెలిపాడు. ప్రజలు కూడా తన పేరుతో వున్న సోషల్ మీడియా అకౌంట్స్ ను నమ్మవద్దంటూ సందీప్ పాటిల్ సూచించారు. 
 

click me!