స్ఫూర్తి ఆయనే... ఎవ్వరూ కదిలించలేరు, నేను అంతే: సెహ్వాగ్

By Siva KodatiFirst Published Apr 13, 2020, 7:34 PM IST
Highlights
ఫుట్‌వర్క్ లేకుండా ఉన్నచోట నుంచే బంతిని బౌండరీ దాటించే హిట్టర్. ఈ క్రమంలో ఈ విధ్వంసక ఆటగాడికి బ్యాటింగ్‌లో స్ఫూర్తి ఎవరో తెలుసా..? భారత రామాయణంలోని వాలి కుమారుడు అంగదుడేనట.
వీరేంద్ర సెహ్వాగ్ అంటే క్రికెట్ ప్రపంచానికి గుర్తొచ్చేది అతడి విధ్వంసమే. బౌలర్ ఎంతటి వాడైనా బంతి బౌండరీ దాటాల్సిందే. బౌలర్లను ఉతికారేసే వీరేంద్రుడు.. క్రీజులో ఉన్నంతసేపు వారికి పీడకల మిగులుస్తాడు.

ఫుట్‌వర్క్ లేకుండా ఉన్నచోట నుంచే బంతిని బౌండరీ దాటించే హిట్టర్. ఈ క్రమంలో ఈ విధ్వంసక ఆటగాడికి బ్యాటింగ్‌లో స్ఫూర్తి ఎవరో తెలుసా..? భారత రామాయణంలోని వాలి కుమారుడు అంగదుడేనట.

ఆదివారం రాత్రి ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన.. వీరూ ఈ విషయాన్ని వెల్లడించాడు. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అవుతాడు. వాలి కుమారుడు అంగదుడు యువరాజు అవుతాడు.

ఇక రావణుడితో యుద్ధానికి ముందు రాముడు సంధి కోసం చివరిసారి రాయబారానికి పంపుతాడు. ఈ సందర్భంగా రావణుడికి ముందు అంగదుడు తన వీరత్వంతో పాటు బలప్రదర్శననూ చూపిస్తాడు. పుట్టుకతోనే  అంగదుడు ఎంతో బలవంతుడు. ఒక్కసారి ఆయన కాలుపెట్టి నిలపెడితే కదిలించడం ఎవరితరం కాదు.

ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ‘‘ అంగద్ జీ రాక్స్’’ అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ నిజంగానే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఎన్నోసార్లు బెంబేలెత్తించాడు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాడంటే వీరేంద్రుడిని ఆపడం ఎవరి వల్లా కాదని ఎన్నోసార్లు నిరూపించాడు. 
click me!