ఫార్మాట్ మారినా, వేదిక మారినా... ఏషియా కప్ కి కలిసిరాని కాలం!

By Sree s  |  First Published Apr 12, 2020, 5:57 PM IST

అక్టోబర్‌లో జరగాల్సిన 2020 టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో, సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ (టీ20) నిర్వహణపైనా సందిగ్ధత నెలకొంది. క్రికెట్‌ ప్రపంచం అనిశ్చితిలో కొనసాగుతున్న తరుణంలో ఆసియాకప్‌ నిర్వహణ బోర్డు (పాకిస్థాన్‌) పీసీబీ చైర్మెన్‌ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 

కరోనా వైరస్‌ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. చివరి 30 రోజుల్లోనే క్రికెట్‌ ఏకంగా 80 మ్యాచు రోజులను కోల్పోయింది. కరోనా వైరస్‌ మహమ్మారి మూలంగా ప్రస్తుత టోర్నీలు రద్దు కావటమే కాదు భవిష్యత్‌లో జరగాల్సిన టోర్నీలను సైతం వాయిదా వేయక తప్పటం లేదు. 

అక్టోబర్‌లో జరగాల్సిన 2020 టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో, సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ (టీ20) నిర్వహణపైనా సందిగ్ధత నెలకొంది. క్రికెట్‌ ప్రపంచం అనిశ్చితిలో కొనసాగుతున్న తరుణంలో ఆసియాకప్‌ నిర్వహణ బోర్డు (పాకిస్థాన్‌) పీసీబీ చైర్మెన్‌ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 

Latest Videos

ఈ ఏడాది ఆసియా కప్‌ నిర్వహణ సాధ్యపడకపోవచ్చని సూత్రప్రాయంగా వెల్లడించారు. ' ఆసియా కప్‌ నిర్వహణపై అనిశ్చితి వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచ అంతా సందిగ్ధంలోనే ఉంది. 

సెప్టెంబర్‌లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. నా అభిప్రాయాన్ని తప్పుగా భావించవద్దు. ఆసియా కప్‌ నిర్వహణ ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది. ఎక్కువగా ఊహాగానాలు ఉండటం మేలు చేయదు. 

ఆసియా కప్‌ షెడ్యూల్‌ సమయానికి ఓ నెల ముందు పరిస్థితి కుదుట పడవచ్చు' అని పీసీబీ చైర్మెన్‌ ఈషన్‌ మణి అన్నారు. 2020 ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ కలిగి ఉంది. ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో యు.ఏ.ఈలో నిర్వహించేందుకు పాకిస్థాన్‌ ప్రణాళిక రూపొందించింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత్‌ సుమఖత వ్యక్తం చేసే అవకాశం ఏమాత్రం లేదు!.

click me!