European Cricket League: క్రికెట్ లో తమ అద్భుత ప్రదర్శనతో అలరించే క్రీడా విన్యాసాలు చూశాం. ఇదే సమయంలో అలాంటి అలరించే అద్బుత విన్యాసాలు చేయబోయి అభాసుపాలయ్యే సంఘటనలు సైతం చాలా చూశాం. ఇదే క్రమంలో రనౌట్ చేద్దామని ఫుట్ బాల్ షాట్ ఆడాడు. ఇంకేముంది గెలిచే మ్యాచ్ కాస్తా.. చేజారింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నవ్వులు పూయిస్తున్నాయి.
Cricket viral video: క్రికెట్ లో తమ అద్భుత ప్రదర్శనతో అలరించే క్రీడా విన్యాసాలు చూశాం. ఇదే సమయంలో అలాంటి అలరించే అద్బుత విన్యాసాలు చేయబోయి అభాసుపాలయ్యే సంఘటనలు సైతం చాలా చూశాం. ఇదే క్రమంలో రనౌట్ చేద్దామని కీపర్ ఫుట్ బాల్ షాట్ ఆడాడు. ఇంకేముంది గెలిచే మ్యాచ్ కాస్తా.. చేజారింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నవ్వులు పూయిస్తున్నాయి.
యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా యునైటెడ్ క్రికెట్ క్లబ్, ప్రాగ్యూ టైగర్స్ మధ్య టీ10 మ్యాచ్ జరిగింది. అయితే, యునైటెడ్ జట్టు గెలవాలంటే చివరి రెండు బంతుల్లో మూడు చేయాలి. ఇలాంటి తరుణంలో ప్రత్యర్థి జట్టు వికెట్ కీపర్ రనౌట్ చేసేందుకు ప్రయత్నించి.. ఫుట్ బాల్ షాట్ ఆడాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్తా చేజారింది.
undefined
యునైటెడ్ బ్యాటర్లు ఆయుష్ శర్మ, అభిమన్యు సింగ్ క్రీజ్‌లో ఉండగా, టైగర్స్ బౌలర్ కట్టుదిట్టంగానే బంతిని వేయగా, ఆడటంలో ఆయుష్ విఫలం కాగా, వికెట్ కీపర్ సైతం బాల్‌ను సరిగ్గా పట్టుకోలేకపోయాడు. దీంతో బ్యాటర్లు పరుగు కోసం ప్రయత్నించారు. ఇక వికెట్ కీపర్ వెంటనే బంతిని కాలితో వికెట్ల మీదకు ఫుట్ బాల్ షాట్ కొట్టాడు. కానీ అది స్టంప్స్‌ను తాకకుండా వెళ్లిపోయింది. దీంతో బ్యాటర్లు రెండు పరుగులు పూర్తి చేశారు. కంగారు పడిన ఫీల్డర్ బంతిని బలంగా విసరడంతో నేరుగా బౌండరీ లైన్ దాటింది. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే యునైటెడ్ క్రికెట్ క్లబ్ గెలిచింది.
Cricket at its wildest!🤯 pic.twitter.com/J6BSLhqYqt
— European Cricket (@EuropeanCricket)