INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... కుల్దీప్ స్థానంలో నటరాజన్...

Published : Mar 28, 2021, 01:09 PM IST
INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... కుల్దీప్ స్థానంలో నటరాజన్...

సారాంశం

వరుసగా మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడిన విరాట్ కోహ్లీ... కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్‌కి చోటు... స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండా మూడో వన్డేలో టీమిండియా...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేయనుంది. మొదటి రెండు వన్డేల్లో చెరో వన్డే గెలిచిన ఇండియా, ఇంగ్లాండ్ 1-1 తేడాతో సమంగా ఉన్న విషయం తెలిసిందే.  

మొదటి రెండు వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్‌కి తుది జట్టులో చోటు కల్పించాడు విరాట్ కోహ్లీ. భారత జట్టులో కృనాల్ పాండ్యా ఒక్కటే స్పిన్నర్‌గా ఉన్నాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ 

ఇంగ్లాండ్ జట్టు: జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలాన్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, అదిల్ రషీద్, రీస్ తోప్లే, మార్క్ వుడ్

 

PREV
click me!

Recommended Stories

IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
IND vs WI : వెస్టిండీస్‌తో చావో రేవో.. హోం గ్రౌండ్ లో రింకూ సింగ్ ఆడేనా?