ఆదుకున్న సిబ్లీ, స్టోక్స్: ముగిసిన తొలి రోజు ఆట.. పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్

By Siva KodatiFirst Published Jul 17, 2020, 9:38 PM IST
Highlights

ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మెరుగైన స్థితిలో నిలిచింది.

ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

డామ్ సిబ్లీ ( 86 బ్యాటింగ్ ), బెన్‌స్టోక్స్ (59 బ్యాటింగ్) అర్థ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ తడబడుతూనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్పిన్నర్ ఛేజ్‌తో బౌలింగ్‌ చేయించిన విండీస్ వ్యూహం ఫలించింది. దీంతో ఇంగ్లాండ్ 29 పరుగులకే రెండు వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో సిబ్లీ, కెప్టెన్ జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే  జోసెఫ్ అల్జారి పదునైన ఔట్ స్వింగ్‌తో రూట్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత సిబ్లీ, స్టోక్స్ ఆచితూచి ఆడుతూ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని విడదీసేందుకు వెస్టిండీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. 

click me!