అమ్మో ‘‘బోర్’’ బాబోయ్: భారత టెస్ట్ పిచ్‌లపై నోరుపారేసుకున్న మైఖేల్ వాన్

By Siva KodatiFirst Published Oct 11, 2019, 5:49 PM IST
Highlights

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో టెస్ట్ మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌లు బోర్ కొట్టిస్తాయని అభిప్రాయపడ్డాడు. 

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో టెస్ట్ మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌లు బోర్ కొట్టిస్తాయని అభిప్రాయపడ్డాడు.

తొలి మూడు, నాలుగు రోజులు సదరు పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌‌కు అనుకూలంగా ఉంటాయని అతను ట్వీట్ చేశాడు. దీనిపై భారత అభిమానులు మండిపడ్డారు.. ఇంగ్లాండ్‌లో చెత్త వాతావరణం ఉంటుందని, 2019 వన్డే ప్రపంచకప్‌లో ఎన్నో మ్యాచ్‌లు వర్షార్పణం అయిన సంగతిని గుర్తు చేస్తూ టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు పేల్చారు.

కాగా గురువారం మీడియాతో మాట్లాడిన మైఖేల్ వాన్.. తన దృష్టిలో వన్డేల్లో ధోనియే అత్యుత్తమ నాయకుడని వ్యాఖ్యానించాడు.

వికెట్ల వెనుక నుంచి ఆటను అర్ధం చేసుకునే విధానం, ఒత్తిడిని తట్టుకునే నేర్పు, బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ధోనిలో మెండుగా ఉన్నాయని వాన్ అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీ చేసే పద్ధతి తనకు నచ్చుతుందని మైఖేల్ వాన్ తెలిపాడు.

 

Test Match Cricket pitches in India are boring ... The first 3/4 days the contest is far too in favour of the Bat ... needs more action for the bowler ... My thought of the day ...

— Michael Vaughan (@MichaelVaughan)
click me!