పీక్స్‌లోకి ‘బజ్‌బాల్’ పిచ్చి... 60 ఓవర్లు కూడా ఆడకుండా ఇన్నింగ్స్ డిక్లేర్! టెస్టుల్లో ఇలా ఆడితే...

Published : Feb 16, 2023, 03:53 PM ISTUpdated : Feb 16, 2023, 03:57 PM IST
పీక్స్‌లోకి ‘బజ్‌బాల్’ పిచ్చి... 60 ఓవర్లు కూడా ఆడకుండా ఇన్నింగ్స్ డిక్లేర్! టెస్టుల్లో ఇలా ఆడితే...

సారాంశం

England vs New Zealand: 58.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 37 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్...

టెస్టు క్రికెట్‌‌లో దూకుడు మంత్రాన్ని జపించి,‘బజ్‌బాల్’ పద్ధతిని తీసుకొచ్చింది ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ నేతృత్వంలో ఈ బంతిని బాదుడే టెక్నిక్‌గా ఎంచుకుని వరుస విజయాలతో దూసుకుపోతోంది ఇంగ్లాండ్.. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్, తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ని మొదటి రోజు రెండో సెషన్‌లోనే డిక్లేర్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది...

టాస్ గెలిచిన న్యూజిలాండ్, ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, 58.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి రోజే అది కూడా కనీసం 59 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. ఓవర్ కాన్ఫిడెన్స్‌ అని కొందరు అంటుంటే, ఇది క్రేజీ అని మరికొందరు అంటున్నారు...

జాక్ క్రావ్లే 4 పరుగులు చేసి అవుట్ కాగా డంక్లెట్ 68 బంతుల్లో 14 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. ఓల్లీ పోప్ 42, జో రూట్ 14 పరుగులు చేయగా హారీ బ్రూక్ 81 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 19, క్రిస్ ఫోక్స్ 38, స్టువర్ట్ బ్రాడ్ 2, జాక్ లీచ్ 1 పరుగు చేసి అవుట్ కాగా ఓల్లీ రాబిన్‌సన్ 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు తీయగా నీల్ వాగ్నర్ 4 వికెట్లు పడగొట్టాడు. జాక్ లీచ్ అవుట్ కావడంతో 9వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ మహా అయితే మరో 5-10 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి ఉండేది. అయితే నీల్ వాగ్నర్‌కి 5 వికెట్లు ఇవ్వడం ఇష్టం లేకనో లేక ఆలౌట్ అవ్వకుండా డిక్లేర్ చేస్తే కిక్ వస్తుందనే ఉద్దేశంతోనో తెలీదు కానీ 58.2 ఓవర్లకే తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసేసింది ఇంగ్లాండ్...

మొదటి రోజు రెండో సెషన్‌లోనే బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 37 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. 1 పరుగు చేసిన టామ్ లాథమ్‌ని రాబిన్‌సన్ అవుట్ చేయగా 6 పరుగులు చేసిన కేన్ విలియంసన్, 4 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌లను జేమ్స్ అండర్సన్ అవుట్ చేశాడు...

డివాన్ కాన్వే 17 పరుగులు చేసి, నైట్‌ వాచ్‌మెన్‌గా వచ్చిన నీల్ వాగ్నర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 288 పరుగులు వెనకబడి ఉంది న్యూజిలాండ్..

2003 నుంచి 21 ఏళ్లుగా ప్రతీ ఏడాది టెస్టుల్లో వికెట్ తీసిన ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం 617 టెస్టు వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత 100 టెస్టు వికెట్లు తీయడం విశేషం..

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !