విరాట్‌ని అవుట్ చేస్తే మావాళ్లు కూడా నన్ను తిడతారు! మా ఆవిడతో దాని గురించే... - నాథన్ లియాన్

Published : Feb 16, 2023, 02:08 PM IST
విరాట్‌ని అవుట్ చేస్తే మావాళ్లు కూడా నన్ను తిడతారు! మా ఆవిడతో దాని గురించే... - నాథన్ లియాన్

సారాంశం

అశ్విన్‌ వీడియోలు చూసి, ఇక్కడికి వచ్చాను... విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఎంజాయ్ చేస్తా! అతను వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ కామెంట్.. 

స్వదేశంలో వరుసగా రెండు సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆసీస్‌ని రెండుసార్లు ఆస్ట్రేలియా గడ్డ మీదే ఓడించింది భారత జట్టు. దీంతో ఈసారి ఎలాగైనా ఇండియాని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది ఆస్ట్రేలియా..

భారీ అంచనాలతో సిరీస్‌ని ఆరంభించిన ఆసీస్‌కి నాగ్‌పూర్ టెస్టులో గట్టి షాక్ తగిలింది. భారత స్పిన్ దెబ్బకు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా.. ఆసీస్ ఎంతో నమ్మకం పెట్టుకున్న నాథన్ లియాన్ 49 ఓవర్లు వేసినా ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు...

‘విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడమంటే ఓ దేశంతో ఒక్కడిగా యుద్ధం చేయడమే. అప్పుడప్పుడూ సక్సెస్ రావచ్చు కానీ విరాట్‌ని అవుట్ చేస్తే అందరూ నన్ను హేట్ చేస్తారు. కొన్నిసార్లు ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ కూడా విరాట్‌ని ఎందుకు అవుట్ చేశావని తిడుతూ మెసేజ్‌లు పెడతారు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్‌కి కొన్నేళ్ల కిందట బౌలింగ్ చేసినప్పుడు నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది...

విరాట్ కోహ్లీ ప్రస్తుత తరంలో బెస్ట్ క్రికెటర్. అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. విరాట్‌కి బౌలింగ్‌ చేయడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తా. ఓ ఛాలెంజ్‌గా భావిస్తా. అశ్విన్‌తో నన్ను పోల్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అతను వేరే లెవెల్ క్రికెటర్...

ఇప్పటికే అశ్విన్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అతనితో పోలిస్తే నా బౌలింగ్ వేరు. ఇక్కడికి రావడానికి ముందు టీవీ ముందు కూర్చొని అశ్విన్ బౌలింగ్ వీడియోలు చూశా. నా భార్యతో కలిసి అశ్విన్ బౌలింగ్ గురించి మాట్లాడేవాడిని. నా బుర్ర తినకు అని ఆవిడ తిట్టేది...

నేర్చుకోవడంలో తప్పు లేదు. ఆటలో ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటేనే సక్సెస్ వస్తుంది. ప్రత్యర్థిని అంచనా వేయాలంటే అతని బలం తెలుసుకోవాలి. నేను చేసేది అదే. అశ్విన్‌ స్కిల్స్‌ గురించి ప్రపంచం అంతటికీ తెలుసు. అతను ఎక్కడైనా బౌలింగ్ చేసి వికెట్లు తీయగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సమయానికి ముందు నాథన్ లియాన్ 396 వికెట్లతో ఉండగా రవిచంద్రన్ అశ్విన్ 364 వికెట్లతో ఉన్నాడు. కొద్ది రోజుల్లో అశ్విన్ 400+ వికెట్ల మైలురాయి దాటి 450+ వికెట్లను చేరుకోగా నాథన్ లియాన్ ప్రస్తుతం 461 వికెట్లతో అతని కంటే ముందున్నాడు. అయితే నాథన్ లియాన్ ఇప్పటికే 116 టెస్టులు ఆడగా రవిచంద్రన్ అశ్విన్ 89 టెస్టుల్లోనే 457 వికెట్లు పడగొట్టి రికార్డు క్రియేట్ చేశాడు...

నాగ్‌పూర్ టెస్టులో  తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి 8 వికెట్లు నమోదు చేశాడు. ఢిల్లీలో రెండో టెస్టు ఆడే భారత్, ఆస్ట్రేలియా... ఆ తర్వాత ఇండోర్‌లో మూడో టెస్టు ఆడతాయి. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే శీతకాలం కురిసిన మంచు కారణంగా ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ చెడిపోవడంతో మ్యాచ్‌ని ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !