Elon Musk: తూచ్.. అంతా ఉత్తదే.. జోక్ చేశా..! మస్క్ మావ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

By Srinivas MFirst Published Aug 17, 2022, 12:44 PM IST
Highlights

Elon Musk Twitter: ప్రపంచ కుబేరుడు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలుగు నెటిజన్లు ‘మస్క్ మావ’ అని   పిలుచుకునే ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు.  తాజాగా అతడు చేసిన ట్వీట్.. 

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో  అత్యంత ప్రజాధరణ సంపాదించుకున్న మాంచెస్టర్ యూనైటెడ్ ను కొనుగోలు చేస్తున్నానంటూ  బుధవారం ఉదయం ట్విటర్ వేదికగా  ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా ఎప్పటిలాగే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాను ఏ క్రీడా ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం లేదని.. పొద్దున చేసిన ట్వీట్ జోక్ అని  స్పష్టతనిచ్చాడు. మస్క్ ప్రకటనతో ఫుట్‌బాల్ అభిమానులలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడు క్లారిఫై చేయడంతో వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. 

బుధవారం ఉదయం మస్క్ ట్విటర్ వేదికగా..  ‘నేను రిపబ్లికన్, డెమొక్రటిక్.. ఈ రెండు పార్టీలకు మద్దతునిస్తున్నాను’ అని ట్వీట్ చేశఆడు. మళ్ీ కొద్దిసేపటికే.. ‘అంతేగాక  నేను త్వరలోనే  మాంచెస్టర్ యూనైటెడ్ ను కూడా కొనుగోలు చేస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు.  

మస్క్ ప్రకటనతో వ్యాపార ప్రముఖులతో పాటు ఫుట్‌బాల్ అభిమానులు కూడా షాకయ్యారు. అయితే మస్క్ గురించి తెలిసిన పలువురు మాత్రం.. ‘ఇది కూడా  పాత ట్వీట్ల మాదిరిగానే జోక్ అయి ఉంటుందిలే’ అని భావించారు.  మస్క్ ట్వీట్ మీద సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా చర్చలు నడిచాయి. 

మస్క్ రాకతో మాంచస్టర్ యూనైటెడ్ జట్టు రూపురేఖలు మారతాయని ఒకరు.. అబ్బే లేదు, మరింత పతనానికి వెళ్లడం ఖాయమని మరికొందరు.. ఎవరికి తోచిన విధంగా వాళ్లు విశ్లేషణలు, విమర్శలు,  వితండవాదాలు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై మీమ్స్, జోక్స్ పేలాయి. ఇవన్నీ చూసి కావాల్సినంత ఫన్ ను పొందిన తర్వాత మస్క్ మావ మెల్లిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చావు కబురు చల్లగా చెప్పాడు. 

 

Also, I’m buying Manchester United ur welcome

— Elon Musk (@elonmusk)

ఇదే విషయమై ట్విటర్ లో టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ అనే పేరు ఉన్న ట్విటర్ యూజర్.. ఎలన్ మస్క్ ను ఇదే విషయం అడిగారు. ‘మీరు చెబుతున్నది నిజమేనా..?’అని  మస్క్ కు  ప్రశ్న ఎదురైంది.  అప్పుడు మస్క్.. ‘లేదు.  అది (మస్క్ మాంచెస్టర్ జట్టును కొనుగోలు చేస్తున్నాడని) ట్విటర్ లో చాలా కాలంగా జోక్ ప్రచారంలో ఉంది. నేను  ఏ స్పోర్ట్స్ టీమ్ ను కొనుగోలు చేయడం లేదు..’ అని ట్వీటాడు. మస్క్ స్పష్టతనిచ్చాక కూడా ట్విటర్ లో అతడిపై మీమ్స్ వర్షం కురుస్తూనే ఉంది. 

 

No, this is a long-running joke on Twitter. I’m not buying any sports teams.

— Elon Musk (@elonmusk)


 

Manchester United if Elon Musk buys us : pic.twitter.com/p3TgMejJB7

— Pulkit 🔰 (@Oletrain)
click me!