ఒక్క పరుగుతో ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ సెంచరీ మిస్.. ఉమెన్ యాషెస్‌లో ఆసీస్ దూకుడు

Published : Jun 23, 2023, 09:58 AM ISTUpdated : Jun 23, 2023, 09:59 AM IST
ఒక్క పరుగుతో ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ సెంచరీ మిస్.. ఉమెన్ యాషెస్‌లో ఆసీస్ దూకుడు

సారాంశం

Women Ashes 2023: పురుషుల యాషెస్ తో  సమాంతరంగా  ఇంగ్లాండ్ లోనే  జరుగుతున్న  ఉమెన్స్ యాషెస్ లోని ఏకైక టెస్టులో ఎల్లీస్ పెర్రీ రాణించింది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన  ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ..  టెస్టులలో సెంచరీ చేసే అవకాశాన్ని ఒక్క పరుగు తేడాతో  కోల్పోయింది.  పురుషుల యాషెస్ తో  సమాంతరంగా  ఇంగ్లాండ్ లోనే  జరుగుతున్న  ఉమెన్స్ యాషెస్ లోని ఏకైక టెస్టులో ఎల్లీస్ పెర్రీ.. 153 బంతుల్లో  15 బౌండరీల సాయంతో 99  పరుగుుల చేసింది.  మూడంకెల స్కోరుకు ఒక్క పరుగు ముందు ఆమె నిష్క్రమించింది.  పెర్రీ దూకుడుతో  ఆసీస్ తొలి రోజే 85 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. 

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా  జరుగుతున్న  ఏకైక టెస్టులో  ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.   ఓపెనర్లు బెత్ మూనీ (33), లిచ్‌ఫిల్డ్ (23) తొలి వికెట్ కు  35 పరుగులు జోడించారు. వన్ డౌన్ లో వచ్చిన  పెర్రీ  క్రీజులో నిలదొక్కుకుంది. 

మరో ఆల్ రౌండర్ తహిలా మెక్‌గ్రాత్   (83 బంతుల్లో 61, 8 ఫోర్లు)   కూడా   పెర్రీకి జతకలవడంతో   ఆసీస్ స్కోరు బోర్దు పరుగులు పెట్టింది. టెస్టు అయినా ఈ ఇద్దరూ వన్డే తరహా ఆట ఆడారు.  కేట్ క్రాస్, లారెన్ బెల్, ఎక్లిస్టోన్  ఫైలర్  ల బౌలింగ్ న సమర్థవంతంగా ఎదుర్కున్నారు. మూడో వికెట్ కు  పెర్రీ - మెక్‌‌గ్రాత్ లు 119 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు.  

 

క్రీజులో కుదురుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న ఈ జోడీకి స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్  షాకిచ్చింది.  ఆమె వేసిన 47వ ఓవర్లో... మెక్‌గ్రాత్ క్లీన్ బౌల్డ్ అయింది.  ఆ తర్వాత  వచ్చిన జెస్ జొనాసెన్ (11), కెప్టెన్  అలీస్సా హీలి (0) లను కూడా ఎక్లిస్టోన్  పెవలియన్ కు పంపింది.  ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ దిశగా సాగుతున్న పెర్రీని లారెనె్ ఫైలర్ ఔట్ చేసింది. 

కానీ ఆష్లే గార్డ్‌నర్  (76 బంతుల్లో 40, 4 ఫోర్లు, 1 సిక్సర్),  అన్నాబెల్ సదర్లాండ్ (71 బంతుల్లో 39 నాటౌట్, 6 ఫోర్లు) లు  ఆసీస్ స్కోరును 300 మార్కు దాటించారు. ఆఖర్లో గార్డ్‌నర్ నిష్క్రమించింది. తొలి రోజు ముగిసేటప్పటికీ ఆసీస్.. 85 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో  ఎక్లిస్టోన్  3 వికెట్లు తీయగా.. లారెన్ ఫైలర్ 2, కేట్ క్రాస్, లారెన్ బెల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !