కోహ్లీ పై పాక్ క్రికెటర్ ప్రశంసల వర్షం..!

Published : Sep 01, 2023, 10:55 AM ISTUpdated : Sep 01, 2023, 11:06 AM IST
కోహ్లీ పై పాక్ క్రికెటర్ ప్రశంసల వర్షం..!

సారాంశం

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై  పాకిస్తాన్ క్రికెట్ టీమ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్   ప్రశంసించాడు.


ఆసియా కప్ సమరం మొదలౌతోంది. ఈ సమరంలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాక్ జట్లు పోటీపడనున్నాయి. ఈ  మ్యాచ్ కోసం అన్ని దేశాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అందరి కళ్లు విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. పాక్ తో మ్యాచ్ అంటే కోహ్లీ చెలరేగిపోతాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ ఎలా ఆడతాడా? పాక్ క్రికెటర్లను ఎలా ముప్పు తిప్పలు పెడతాడా అని ఎదురు చూస్తున్నారు.

కాగా, ఈమ్యాచ్ నేపథ్యంలో ఓ పాక్ క్రికెటర్ విరాట్  కోహ్లీ పై ప్రశంసలు కురిపించడం విశేషం.  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై  పాకిస్తాన్ క్రికెట్ టీమ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్   ప్రశంసించాడు.  కోహ్లీని ఎదుర్కోవాలంటే   సరైన ప్రణాళికలను కలిగి ఉండాలని చెప్పాడు.

 అతను 2022 T20 ప్రపంచ కప్‌లో కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ నాక్‌ను కూడా గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్ బౌలింగ్ దాడికి వ్యతిరేకంగా మరే ఇతర బ్యాటర్ ఆ విధంగా ఆడలేడని చెప్పాడు.

"కోహ్లీ ఖచ్చితంగా ప్రపంచ స్థాయి ఆటగాడు. అతన్ని ఎదుర్కోవడానికి  చాలా ప్లాన్ చేసుకోవాలి" అని షాదాబ్ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పడం విశేషం.

గత ఏడాది మెల్‌బోర్న్‌లో జరిగిన ఐసిసి టి 20 ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ పాక్ క్రికెటర్ ఇలా విరాట్ పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.కాగా, ఈ మాటలు విని, కోహ్లీ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. దటీజ్ కోహ్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?