
ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ అందుకుంది శ్రీలంక. 165 పరుగుల ఈజీ లక్ష్యఛేదనలో దిముత్ కరుణరత్నే, పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ వికెట్లు త్వరగా కోల్పోయింది లంక. కరుణరత్నే 1, మెండిస్ 5, నిశ్శంక 14 పరుగులు చేసి అవుట్ కావడంతో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక కలిసి నాలుగో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 77 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసిన సమరవిక్రమ, మెహెడి హసన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
2 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చివర్లో కాస్త హై డ్రామా సాగిది. అయితే అప్పటికే శ్రీలంక, 19 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది..
85 బంతుల్లో 4 ఫోర్లతో చరిత్ అసలంక, వన్డేల్లో 9వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 92 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేయగా దసున్ శనక 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేశాడు. 39 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించింది శ్రీలంక.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు, 42.4 ఓవర్లలో 164 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మహ్మద్ నయీం 16 పరుగులు చేయగా తన్జీద్ హసన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 5 పరుగులు చేయగా తోహిద్ హృదయ్ 20 పరుగులు చేశాడు..
ముస్తాఫికర్ రహీమ్ 13, మెహిడీ హసన్ మిరాజ్ 5, మెహిదీ హసన్ 6 పరుగులు చేయగా టస్కీన్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నజ్ముల్ హుస్సేన్ షాంటో 122 బంతుల్లో 7 ఫోర్లతో 89 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా డకౌట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
శ్రీలంక బౌలర్లలో మతీష పతిరన 4 వికెట్లు తీయగా మతీశ్ తీక్షణ 2 వికెట్లు పడగొట్టాడు. ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లాలగే, దసున్ శనకలకు తలా ఓ వికెట్ దక్కింది. ఒకానొక దశలో 127/4 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్, 37 పరుగుల తేడాతో మిగిలిన 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది.
లంక బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం వంటి సీనియర్లను పెవిలియన్ చేర్చిన మతీష పతిరన, టస్కిన్ అహ్మద్, ముస్తాఫికర్ రెహ్మాన్‌లను డకౌట్ చేశాడు...