టీమిండియాలో ధోనీ.. ఇక ఛాన్స్ లేదంటున్న హర్భజన్ సింగ్

By telugu teamFirst Published Jan 17, 2020, 10:40 AM IST
Highlights

2019 జులైలో ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ జట్టులోకి రాలేదు. ధోనీకి బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. ధోనీ కెరీర్ కు ముగిసిందనే సంకేతాలను దాంతో బీసీసీఐ ఇచ్చిందని భావిస్తున్నారు. 
 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.. టీమిండియాకి ఇక సంబంధాలు తెగిపోయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకెప్పటికీ... టీమిండియాలోకి ధోనీకి చోటు దక్కకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదే విషయం మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చెప్పారు.  ఇక ధోనీకి ఛాన్స్ లేకపోవచ్చని భజ్జీ తాజాగా పేర్కొన్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... టీమిండియాకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రీడాకారుల వార్షి కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. 

బిసీసీఐ విడుదల చేసిన ఆరు కెటగిరీలు ఉన్నాయి. అవి గ్రేడ్ ఏ+,  గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడ్ సీ. టాప్ గ్రేడ్ ఏ+ కెటగిరీల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు 7 కోట్ల రూపాయలు పొందుతారు. ఆ తర్వాతి కెటగిరీల్లో ఉన్న ఆటగాళ్లు 5 కోట్ల రూపాల చొప్పున పొందుతారు. గ్రేడ్ బీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు 3 కోట్ల రూపాయలు, సీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు కోటి రూపాయలు పొందుతారు. 

Also Read టీ20 సిరీస్... పాక్ జట్టులోకి మళ్లీ సానియా మీర్జా భర్త...

2019 జులైలో ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ జట్టులోకి రాలేదు. ధోనీకి బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. ధోనీ కెరీర్ కు ముగిసిందనే సంకేతాలను దాంతో బీసీసీఐ ఇచ్చిందని భావిస్తున్నారు. 

ఈ వార్త ధోనీ అభిమానులను ఎంతగానో కలవర పరిచింది. వరల్డ్ కప్ తర్వాత టీమిండియా చాలా సిరీస్ లు ఆడింది. కానీ.. ఏ ఒక్కదాంట్లో ధోనీ లేరు. ఏ సిరీస్ లో ధోనీ ఆడతారా అంటూ.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... బీసీసీఐ జాబితాలో ధోనీ లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

దీనిపై తాజాగా హర్భజన్ సింగ్ స్పందించారు.  ‘‘ ధోనీ మళ్లీ టీమిండియా తరపున ఆడతాడు అని నేను అనుకోవడం లేదు. కేవలం 2019 వరల్డ్ కప్ వరకే ఆడాలని అతను అనుకున్నాడు. అతను కేవలం ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు’’ అని హర్భజన్ పేర్కొన్నారు.

click me!