MI vs RCB : వాంఖడే స్టేడియంలో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. అద్భుతమైన సరికొత్త షాట్స్ ఆడుతూ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు.
Boom Boom Bumrah : ముంబైలోని వాంఖడే స్టేడియంలో బ్యాటర్లు పరుగుల వరద పారించాడు. బౌలింగ్ లో బుమ్రా దుమ్మురేపాడు. బుమ్రా వికెట్లు తీసుకుంటున్న మరో ఎండ్ లో దినేష్ కార్తీక్ ధనాధన్ ఇన్నింగ్స్ లో సూపర్ షాట్ల్స్ ఆడాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ 2024 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. బూమ్రా అద్భుతమైన బౌలింగ్ తో విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు విల్ జాక్స్ 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
ఛాంపియన్ ప్లేయర్ తో మరో ఛాంపియన్ ఢీ.. బుమ్రా ముందు కోహ్లీ.. !
ఆ తర్వాత రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరోసారి గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కపరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. మరో ఎండ్ లో బాధ్యతాయుతంగా ఆడిన ఫాఫ్ డుప్లెసిస్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్ కు ఇది తొలి హాఫ్ సెంచరీ. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ దుమ్మురేపాడు. మధ్యలో వచ్చిన ఆర్సీబీ ప్లేయర్లు స్వల్ప పరుగులకే ఔటయ్యారు. మహిపాల్ లోమ్రార్ 0, వైషాక్ విజయకుమార్ 0, సౌరవ్ చౌహాన్ 9 తక్కువ పరుగులకే వరుసగా ఔటయ్యారు. చివరి వరకు దూకుడుగా ఆడిన దినేష్ కార్తీక్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. సూపర్ షాట్స్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనదైన స్టైల్లో మరోసారి సరికొత్త షాట్స్ ఆడాడు.
It's not a replay ❌
It's just using his improvisation perfectly 👌 not once but four times.
Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/IzU1SAqZ6m
చివరలో దినేష్ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ తో బెంగళూరు టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా మరోసారి మాయ చేశాడు. బుమ్రా అద్భుతమైన యార్కర్లు వేస్తూ 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఆర్సీబీపై ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు.
బూమ్ బూమ్ బూమ్రా.. కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్.. ! 5 వికెట్లతో అదరగొట్టాడు..