షారుఖ్ జట్టును ప్రమోట్ చేయడం తప్పే...బిసిసిఐకి కార్తిక్ క్షమాపణలు

By Arun Kumar PFirst Published Sep 8, 2019, 2:45 PM IST
Highlights

బిసిసిఐ నిబంధనలను అతిక్రమించేలా వ్యవహరించిన దినేష్ కార్తిక్ బోర్డు ఆగ్రహాానికి గురయ్యాడు. దీంతో అతడు వెంటనే తన తప్పును తెలుసుకుని బిసిసిఐ కి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు.  

బిసిసిఐ నిబంధలకు ఉల్లంఘించేలా వ్యవహరించిన టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్ ఎట్టకేలకు తప్పును ఒప్పుకున్నాడు. బిసిసిఐ అనుమతి లేకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపిఎల్) జట్టు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాడు. ఇలా బోర్డు నిబంధలను అతిక్రమించినందుకు బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నట్లు దినేష్ కార్తిక్ వెల్లడించాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దినేష్ కార్తిక్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్. ఈ టీంకు షారుఖ్ ఖాన్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే కరీబియన్ సూపర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టును కూడా భాలీవుడ్ బాద్ షా షారుఖే కొనుగోలుచేశాడు. ఇలా రెండు జట్లకు చెందిన యాజమాన్యం ఒక్కటే కావడంతో కార్తిక్ సిపీఎల్ లో టిన్ బాగో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానానికి వెళ్లాడు. 

ఈ సందర్భంగా అతడు కేవలం మ్యాచ్ ను వీక్షించడమే కాదు ట్రిన్ బాగో జట్టుకు ప్రచారం కల్పించేలా వ్యవహరించాడు. ఆ జట్టు జెర్సీని ధరించి వారి డ్రెస్సింగ్ రూంలో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. ఇలా ట్రిన్ బాగో-సెయింట్ కిట్స్ టీంల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికన జరిగిన మ్యాచ్ లో కార్తిక్ బిసిసిఐ నిబంధనలను ఉల్లంఘించాడు.

బోర్డు కాంట్రాక్ట్ ఆటగాడైన దినేష్ కార్తిక్ ఇలా వ్యవహారించడంపై బిసిసిఐ సీరియస్ అయ్యింది. అతడికి ఇతర లీగుల్లో ఆడేందుకు గానీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గానీ బిసిసిఐ నుండి అనుమతి లేదు.  కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘణ చర్యల కింద తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కార్తీక్ కి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన  కార్తిక్ బేషరుతుగా బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

దినేష్ కార్తీక్ కి బీసీసీఐ నోటీసులు
 

click me!