కామెంటేటర్‌గా అదరగొడుతున్న దినేష్ కార్తీక్... యూకేలో మోస్ట్ ఫేవరెట్‌‌గా భారత క్రికెటర్...

Published : Aug 28, 2021, 02:45 PM IST
కామెంటేటర్‌గా అదరగొడుతున్న దినేష్ కార్తీక్... యూకేలో మోస్ట్ ఫేవరెట్‌‌గా భారత క్రికెటర్...

సారాంశం

రెగ్యూలర్‌ కామెంటరీకి ఛమత్కరాన్ని జోడించి, నవ్వులు పూయిస్తున్న దినేష్ కార్తీక్... ఇంగ్లాండ్‌లో 2021 బెస్ట్ క్రికెట్ కామెంటేటర్‌గా గుర్తింపు...

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించకముందే, కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్. తనదైన శైలిలో రెగ్యూలర్‌ కామెంటరీకి ఛమత్కరాన్ని జోడించి, నవ్వులు పూయిస్తున్న దినేష్ కార్తీక్, క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్, ది హండ్రెడ్, ఇంగ్లాండ్- ఇండియా టెస్టు సిరీస్‌లకు కామెంటరీ చెప్పిన దినేష్ కార్తీక్... యూకేలో మోస్ట్ ఫేవరెట్ కామెంటేటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఓ ఛానెల్ నిర్వహించిన పోల్‌లో దినేష్ కార్తీక్‌కి అత్యధిక ఓట్లు వచ్చాయి...

వికెట్ కీపింగ్‌లో, బ్యాట్స్‌మెన్‌గా కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన దినేష్ కార్తీక్, భారత క్రికెటర్‌గా కంటే కామెంటేటర్‌గా ఎక్కువ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కొన్నాళ్ల కింద డీకే, క్రికెట్ బ్యాట్స్‌లను పక్కింటోడి భార్యలతో పోలుస్తూ చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదమైనా, తన వ్యాఖ్యలకు నిర్మొహమాటంగా క్షమాపణలు చెప్పి, ఆ వివాదాన్ని చెరిపేసుకున్నాడు...

కామెంటేటర్‌గా లండన్ టూర్‌ ముగించుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 కోసం బ్యాటు, గ్లవ్స్ పట్టి క్రికెటర్‌గా అవతారం ఎత్తబోతున్నాడు దినేష్ కార్తీక్... ఇలా రిటైర్మెంట్‌కి ముందే అటు కామెంటేటర్‌గా, ఇటు క్రికెటర్‌గా రాణిస్తున్న మొట్టమొదటి భారత ప్లేయర్‌గా కూడా నిలిచాడు డీకే...

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే