నరైన్ భీకర ఇన్నింగ్స్: రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా మెరుపు విక్టరీ

By Siva KodatiFirst Published Apr 8, 2019, 7:36 AM IST
Highlights

కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై మెరుపు విజయాన్ని సొంతం చేసుకుంది. 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది

కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై మెరుపు విజయాన్ని సొంతం చేసుకుంది. 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ చేతిలో వికెట్లున్నా.... కోల్‌కతా బౌలర్ల ముందు నిలబడలేకపోయింది.

బట్లర్ కూడా తన శైలిలో ఆడకపోవడంతో 6 ఓవర్లకు కేవలం 28 పరుగులే చేసింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్మిత్‌ క్రీజులో ఉన్నప్పటికీ పరుగులు మాత్రం రాలేదు. అయితే చివర్లో స్మిత్ కాస్త బ్యాట్ ఝళిపించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన నైట్ రైడర్స్‌‌కు కూడా రాజస్థాన్ లాగా పిచ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని భావించారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ సునీల్ నరైన్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.

లిన్ కూడా అతనితో పోటీ పడి బౌండరీలు బాదడంతో కోల్‌కతా స్కోరు బోర్డు పరుగులు తీసింది. నరైన్ వెనుదిరిగినా లిన్ తన జోరును కొనసాగించి అర్థసెంచరీ తర్వాత నిష్క్రమించాడు. చివర్లో ఉతప్ప, శుభ్‌మన్ గిల్ లాంచనాన్ని పూర్తి చేశారు. దీంతో కోల్‌కతా.. రాజస్థాన్‌ రాయల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. 

click me!