Deepak Chahar: శ్రీలంకతో టీ20లకు ముందే టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం..?

Published : Feb 21, 2022, 10:16 AM IST
Deepak Chahar: శ్రీలంకతో టీ20లకు ముందే టీమిండియాకు భారీ షాక్..  స్టార్ ఆల్ రౌండర్ దూరం..?

సారాంశం

Team India Squad for Srilanka T20I's: ఈనెల 24 నుంచి లక్నో వేదికగా శ్రీలంకతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. 

త్వరలో శ్రీలంకతో టీ20 సిరీస్ లకు ముందే టీమిండియా కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లి, వికెట్ కీపర్  రిషభ్ పంత్  సేవలను కోల్పోయిన భారత జట్టు.. ఇప్పుడు ఆల్ రౌండర్  దీపక్ చాహర్ సేవలను కూడా  కోల్పోనున్నది. వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా అతడికి గాయం కావడంతో.. ఓవర్ మధ్యలోనే  పెవిలియన్ కు చేరిన విషయం తెలిసిందే.  గాయం వేధించడంతో  అతడు మళ్లీ క్రీజులోకి రాలేదు. దీంతో అతడు లంకతో సిరీస్ కు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 

ఆదివారం  కోల్కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా విండీస్ తో జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు అద్భుత విజయంలో దీపక్ చాహర్ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలోనే విండీస్ ను దెబ్బకొట్టి  ఆ జట్టును కోలుకోనీయకుండా చేశాడు.  

 తొలి ఓవర్ వేసిన చాహర్.. ఓపెనర్ కైల్ మేయర్స్ ను ఔట్ చేశాడు. ఇక తన రెండో ఓవర్లో మరో ఓపెనర్ షే హోప్ ను కూడా పెవిలియన్ కు పంపాడు.  కానీ అదే ఓవర్లో ఐదో బంతి వేసి బంతిని వేసే క్రమంలో గాయపడ్డాడు. గ్రైండ్ లోనే కుప్పకూలిపోయిన  చాహర్ ను పెవిలియన్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు.  అయినా గాయం  తగ్గకపోవడంతో  అతడు మళ్లీ ఫీల్డ్ కు రాలేదు. 

 

ఒకవేళ అతడి గాయం పెద్దదైతే ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరముంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. ఈనెల 24 నుంచి శ్రీలంకతో మొదలయ్యే టీ20 సిరీస్ కు అతడు అందుబాటులో ఉండడు.  చాహర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి గాయం పెద్దదని తేలితే చాహర్ ను తక్షణమే బెంగళూరు లోని  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు వెళ్లనున్నాడు. 

ఇప్పటికే విరాట్ కోహ్లితో పాటు  వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా శ్రీలంకతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నారు. పనిభారం కారణంగా వీరికి టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.  రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్  బాధ్యతలు  మోయనున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా  గాయపడ్డ కెఎల్ రాహుల్ కూడా శ్రీలంకతో టీ20లకు అందుబాటులో ఉండేది అనుమానమే అని సమాచారం. ఇక ఇప్పుడు చాహర్  కు గాయం పెద్దదని తేలితే  టీమిండియా అతడి సేవలను కూడా కోల్పోనున్నది. 

లంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే
IND vs NZ : ఊచకోత అంటే ఇదేనేమో.. కివీస్ బౌలర్లను ఉతికారేసిన ఇషాన్, సూర్య !