సరదాగా దీపక్ చాహర్ సంగీత్... పెళ్లికి హాజరుకానున్న ధోనీ దంపతులు..!

Published : Jun 01, 2022, 10:18 AM IST
  సరదాగా దీపక్ చాహర్ సంగీత్... పెళ్లికి హాజరుకానున్న  ధోనీ దంపతులు..!

సారాంశం

 చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో సహా హాజరుకానున్నారు. కాగా..  ప్రస్తుతం చాహర్ సంగీత్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట  వైరల్ గా మారాయి.  

టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్  ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ఈ రోజు (జూన్ 1)  జయ భరద్వాజ్ ని ఆగ్రాలో వివాహమాడనున్నాడు. ఈ క్రమంలో... మంగళవారం పెళ్లిలో భాగంగా సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. కాగా.. వీరి పెళ్లికి టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో సహా హాజరుకానున్నారు. కాగా..  ప్రస్తుతం చాహర్ సంగీత్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట  వైరల్ గా మారాయి.

 

కాగా.. దీపక్ చాహర్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022లో పాల్గొనలేదు. గాయం కారణంగా చాహర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో... పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. మంగళవారం చాహర్, జయ భరద్వాజ్ ల మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలు చాలా సరదాగా జరిగాయి. కాగా.. వీరి వివాహం బుధవారం రాత్రి 9గంటల సమయంలో జరగనుంది. వీరి పెళ్లికి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబ సమేతంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

జూన్ 1 బుధవారం వివాహం జరగనుండగా, మంగళవారం నుండి వివిధ ఆచారాలు నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నట్లు సమాచారం.

మెహందీ వేడుక మంగళవారం సాయంత్రం 6 గంటలకు, హల్దీ వేడుక బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు.. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని కమల్ మహల్‌లో రిసెప్షన్ వేడుక జరగనుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !