ఐపీఎల్ 2022 సీజన్ సూపర్ సక్సెస్... క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బందికి భారీ నజరానా ఇచ్చిన బీసీసీఐ..

Published : May 31, 2022, 12:35 PM ISTUpdated : May 31, 2022, 12:36 PM IST
ఐపీఎల్ 2022 సీజన్ సూపర్ సక్సెస్... క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బందికి భారీ నజరానా ఇచ్చిన బీసీసీఐ..

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆతిథ్యం ఇచ్చిన ఆరు వేదికలకు క్యూరేటర్లు, గ్రౌండ్‌మెన్‌గా పనిచేసిన వారికి రూ.1.25 కోట్ల నజరానా... స్టేడియాలకు ప్రైజ్‌ మనీ ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జై షా... 

ఐపీఎల్ 2021 సీజన్ అనుభవాల తర్వాత భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలు రేగాయి. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజులకే ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఆ భయం మరింత పెరిగింది...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లా కాకుండా మహారాష్ట్రలోని మూడు వేదికల్లో లీగ్ మ్యాచులన్నీ నిర్వహించడంతో ఐపీఎల్ 2022 సీజన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యింది. ముఖ్యంగా వాంఖడే, డీవై పాటింగ్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఏంసీఏ),బ్రాబోన్, పూణే క్రికెట్ స్టేడియాల్లో నిర్వహించిన లీగ్ మ్యాచులు సూపర్ సక్సెస్ అయ్యాయి...

లీగ్ మ్యాచుల తర్వాత కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైనా పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక వ్యూయర్‌షిప్ దక్కించుకున్న మ్యాచ్‌గా ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌కీ మంచి వ్యూయర్‌షిప్ రాగా... ఫైనల్ మ్యాచ్‌కి ఆరంభంలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మిలియన్లలో రియల్ టైమ్ వ్యూస్ రావడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి కాసేపు మ్యాచుల ప్రసారం కూడా నిలిచిపోయింది...

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో సాంకేతిక లోపాలతో మొదటి నాలుగు ఓవర్లపాటు డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఒక్క సంఘటన మినహా మిగిలిన మ్యాచులన్నీ సజావుగా నిర్వహించి, పూర్తి చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యింది బీసీసీఐ...

74 మ్యాచుల పాటు సాగిన సుదీర్ఘ లీగ్‌ను సూపర్ సక్సెస్ చేయడంలో వెనకుండి పనిచేసిన క్యూరేటర్, పిచ్ సిబ్బందికి ప్రైజ్ మనీని ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 6 వేదికలకు క్యూరేటర్లుగా, గ్రౌండ్‌ మెన్‌గా పనిచేసిన సిబ్బందికి రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ఇస్తున్నట్టు ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

‘కొన్ని ఉత్కంఠభరిత, హై ఓల్టేజీ గేమ్‌లను చూసే అదృష్టం ఈ సీజన్‌లో కలిగింది. దీని కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదలు తెలుపుతున్నా. సీసీఏ, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏ, పూణే స్టేడియాలకి చెరో రూ.25 లక్షలు... అలాగే ప్లేఆఫ్స్ నిర్వహించిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలకు చెరో రూ.12.5 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తున్నాం...

అలాగే ఆరు వేదికల్లో పిచ్ క్యూరేటర్లు, గ్రౌండ్‌ మెన్‌లుగా పనిచేసి, మ్యాచులు సజావుగా పూర్తి చేయడానికి వెనకుండి పోరాడిన హీరోలకు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తున్నామని తెలియచేయడానికి గర్వపడుతున్నా...’ అంటూ ట్వీట్లు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

గ్రౌండ్ ‌మెన్‌కి ప్రైజ్ మనీ అందిస్తున్నట్టు ప్రకటించిన జై షా ట్వీట్‌పై భారత క్రికెటర్, కేకేఆర్ ఆటగాడు అజింకా రహానే స్పందించాడు. ‘ఇది చాలా గొప్ప పని జై షా భాయ్... వెల్ డన్’ అంటూ కామెంట్ చేశాడు అజింకా రహానే...

ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచింది. అయితే బీసీసీఐ సెక్రటిరీగా ఉన్న జై షా, స్టాండ్స్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడివైనా, బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు తటస్థంగా ఉండకుండా ఓ టీమ్‌ని సపోర్ట్ చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు... 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !