DCvsMI: ముంబై ‘ఛాంపియన్’ ఆట... యువ ‘ఢిల్లీ’కి వరుసగా నాలుగో ఓటమి...

Published : Oct 31, 2020, 06:27 PM IST
DCvsMI: ముంబై ‘ఛాంపియన్’ ఆట... యువ ‘ఢిల్లీ’కి వరుసగా నాలుగో ఓటమి...

సారాంశం

ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీ... 9 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకున్న ముంబై ఇండియన్స్...  వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్... ప్లేఆఫ్ చేరాలంటే ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో యువ ఢిల్లీ...

IPL 2020 సీజన్‌లో ఛాంపియన్ ఆటతీరుతో టాప్ ప్లేస్‌లో మరింత దృఢంగా నిలుచుంది ముంబై ఇండియన్స్. ఈ సీజన్‌లో మొట్టమొదట ప్లేఆఫ్‌కి అర్హత సాధించేలా కనిపించిన యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, కష్టాల్లో పడింది. ఢిల్లీ ప్లేఆఫ్ చేరాలంటే ఆఖరి మ్యాచులో తప్పక గెలిచి తీరాలి. 111 పరుగుల ఈజీ టార్గెట్‌ను వికెట్ కోల్పోయి చేధించింది ముంబై.

ముంబై ఇండియన్స్ ఓపెనర్లు డి కాక్, ఇషాన్ కిషన్ కలిసి మొదటి వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డి కాక్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నోకియాకి ఓ వికెట్ దక్కింది.

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !