వారిద్దరి సలహాలను వరల్డ్ కప్ లో ఫాలో అవుతా: శిఖర్ ధావన్

By Arun Kumar PFirst Published Apr 26, 2019, 7:37 PM IST
Highlights

ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఐపిఎల్ సీజన్ 12 ద్వారా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు డిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. ముఖ్యంగా జట్టు కోచ్ రికీ పాంటింగ్, మెంటర్ సౌరవ్ గంగూలీల అనుభవంతో కూడిన సలహాలు,క్రికెట్ మెలవకువలు ఎంతో ఉపయోగకరంగా వున్నాయన్నాడు. ఇవి కేవలం ఈ ఐపిఎల్ కు మాత్రమే పరిమితం చేయనని...వాటిని  ప్రపంచ కప్ లో కూడా ఉపయోగిస్తానని ధావన్ వెల్లడించాడు. 

వారిద్దరు రెండు సక్సెస్ ఫుల్ జట్లకు సారథ్యం వహించారని...అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఎంతో అనభవాన్ని గడించి గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించాడు. ముఖ్యంగా వారు మ్యాచ్ ను అర్థం చేసుకునే విధానం చాలా అద్భుతంగా వుంటుందన్నాడు. మన  ఊహలను అందని విధంగా వారి ఆలోచనలు వుంటాయని తెలిపాడు.ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాల నుండి తాను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. 

అయితే మరికొద్ది రోజుల్లో తాను ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనాల్సి వుంది కాబట్టి పాంటింగ్,గంగూలీల నుండి వీలైనన్ని ఎక్కువ  సలహాలు, మెళకువలు తీసుకుంటున్నానని అన్నారు.  తప్పకుండా వీరిద్దరి నుండి నేర్చకున్నవన్నీ ప్రపంచ కప్ లో ఉపయయోగిస్తానని...అవి  తనకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు ధావన్ తెలిపాడు. 

click me!