తిరిగొచ్చిన భువీ, రోహిత్ శర్మకు నో రెస్ట్: వెస్టిండీస్ తో సిరీస్ కు జట్టు ఇదీ...

Published : Nov 22, 2019, 06:17 AM ISTUpdated : Nov 22, 2019, 06:29 AM IST
తిరిగొచ్చిన భువీ, రోహిత్ శర్మకు నో రెస్ట్: వెస్టిండీస్ తో సిరీస్ కు జట్టు ఇదీ...

సారాంశం

వెస్టిండీస్ తో జరిగే వన్డే, టీ20 సీరిస్ లకు భారత జట్టు ఎంపికైంది. భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వకుండా కొనసాగిస్తన్నారు. కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు.

ముంబై: వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కు భారత జట్టు ఎంపిక జరిగింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా వెస్టిండీస్ తో మూడు ట్వంటీ20 మ్యాచులు, మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది. 

జట్టు ఎంపికకు ముందు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.. అయితే, అతన్ని కొనసాగించాలని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి పరిమిత ఓవర్ల జట్టులోకి వచ్చారు. 

ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ కు కూడా జట్టులో స్థానం దక్కింది.. డిసెంబర్ 6వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.

టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ

వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, చాహల్, కుల్దీప్ యాదవ్, షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

PREV
click me!

Recommended Stories

గంభీర్ ఒక్కడే కాదు.. టీమ్ అందరిదీ తప్పే.! టీమిండియాను ఏకీపారేశాడుగా
IPL 2026 వేలంలో బిగ్ ట్విస్ట్.. క్వింటన్ డి కాక్ సహా 35 మంది సర్‌ప్రైజ్ ఎంట్రీ !