అంతిమ సంస్కారాలకు క్యూలు, నిద్ర పట్టేది కాదు: భారత్ లో కరోనాపై వార్నర్

By telugu teamFirst Published Jun 2, 2021, 8:18 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. భారతదేశంలోని పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.

మెల్బోర్న్: భారతదేశంలో కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులపై సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. భారతదేశంలో రెండో దశలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిందని, దాన్ని ప్రత్యక్షంగా చూసి ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. 

తన ఇంటికి చేరుకున్న డేవిడ్ వార్నర్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. భారతదేశంలో కరోనా రెండో దశ తుది అంకానికి చేరుకున్నప్పటికీ అక్కడి పరిస్థితుల్లో మార్పు లేదని ఆయన అన్నాడు. భారతదేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగిన ఏప్రిల్ నెల పరిస్థితుల గురించి ఆయన మాట్లాడాడు. 

ఆక్సిజన్ కోసం భారతేదశంలోని ప్రజలు అల్లాడిపోవడం కళ్లారా చూశానని, మైదానం నుంచి హోటల్ కు వెళ్లే సమయాల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు వీధుల్లో లైన్లు కట్టడం చూశానని ఆయన అన్నాడు. అవి చూసిన తర్వాత రాత్రి నిద్ర పట్టేది కాదని అన్నాడు. 

ఆలాంటి పరిస్థితుల్లో బిసిసిఐ ఐపిఎల్ రద్దు చేసి సముచితంగా వ్యవహరించిందని ఆయన అన్నాడు బయో బబుల్ లో కూడా కేసులు నమోదైన తర్వాత క్రికెటర్లంతా అక్కడి నుంచి ఎప్పుడు బయపడుతామా అని వేచి చూశారని ఆయన అన్నాడు 

భారతీయులకు క్రికెట్ మీద ఉన్న మక్కువపై కూడా ఆయన మాట్లాడాడు. నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మే 4వ తేదీన ఐపిఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. లీగ్ లో మిగిలిన 31 మ్యాచులను యుఏఈ వేదికగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయింంచింది.

click me!