తృటిలో గోల్ మిస్ చేసిన విరాట్ కోహ్లీ... భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఫన్నీ కామెంట్...

Published : May 26, 2021, 04:17 PM IST
తృటిలో గోల్ మిస్ చేసిన విరాట్ కోహ్లీ... భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఫన్నీ కామెంట్...

సారాంశం

ఫుట్‌బాల్ గోల్ కొడుతున్న వీడియోను పోస్టు చేసిన విరాట్ కోహ్లీ... కోచింగ్ ఇవ్వమంటావా... అంటూ కామెంట్ చేసిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ...

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే కూడా చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా ఫుట్‌బాల్ ఆడుతూ గడిపేస్తుంటాడు విరాట్ కోహ్లీ. తాజాగా బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న కాలక్షేపం కోసం ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను పోస్టు చేశాడు విరాట్ కోహ్లీ...

ఈ వీడియోలో ఫ్రీ కిక్ కొట్టేందుకు వచ్చిన విరాట్ కోహ్లీ, గోల్‌ను తృటిలో మిస్ చేశాడు. ఈ వీడియోకి ‘యాక్సిడెంటల్ క్రాస్‌బార్ ఛాలెంజ్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు కోహ్లీ. కోహ్లీ ట్వీట్ చేసిన వీడియోపై భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ స్పందించాడు.

 

‘అన్ని కోచింగ్ సెషన్స్‌కి కలిసి ఒకేసారి బిల్లు పంపాలా? లేక ఈజీగా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తావా...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ ఛెత్రీ. దీనికి విరాట్... ‘అవున్ కెప్టెన్, మీరు మజా చేసుకోండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సునీల్ ఛెత్రీ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది