గణేష్ చతుర్థి విషెస్ తో.. భారతీయుల మనసు దోచేసిన వార్నర్...!

Published : Aug 31, 2022, 12:20 PM IST
  గణేష్  చతుర్థి విషెస్ తో.. భారతీయుల మనసు దోచేసిన వార్నర్...!

సారాంశం

వీలు దొరికినప్పుడల్లా ఆయన తెలుగు ప్రజలపై తన అభిమానం చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన.. ఇక్కడి వారికి  వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.  

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ ప్రియులకు మాత్రమే కాదు...క్రికెట్ చూడని వారికి కూడా పరిచయమే.  ఆయనంటే ఆస్ట్రేలియా దేశస్తులకు మాత్రమే కాదు... భారతీయులకు కూడా అభిమానమే. ఆయన మన దేశంపై చూపిస్తున్న ప్రేమ కారణంగానే ఆయనకు అభిమానులు పెరిగిపోయారు. 

ఆయన ఎక్కువగా టాలీవుడ్ హీరోల సినిమాల పాటలకు డ్యాన్స్ వేయడం, డైలాగ్స్ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఆయన తెలుగు ప్రజలపై తన అభిమానం చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన.. ఇక్కడి వారికి  వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

గణేషుని విగ్రహానికి నమస్కారం చేస్తున్నట్లు ఓ ఫోటో డిజైన్ చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి ఆయన క్యాప్షన్ కూడా ఇచ్చాడు.‘ అక్కడ ఉన్న నా స్నేహతులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీకు సుఖ సంతోషాలు లభించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆయన క్యాప్షన్ లో పేర్కొన్నాడు. కాగా... ఆయన పోస్టు కి రెస్పాన్స్ బాగా అదిరింది.

తెలుగువారు కూడా ఆయన పోస్ట్ కి రిప్లై ఇస్తుండటం విశేషం. ‘అందుకే అన్న నిన్ను ఇక్కడ సెటిల్ అవ్వమని చెప్పింది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్  చేయడం గమనార్హం. మీ మీద గౌరవం మరింత పెరిగిందంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !