
ఆసియాకప్ 2022 ఉత్సాహం సాగుతుంది. ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో... భారత్ విజయం సాధించింది. ఈ సంగతి పక్కన పెడితే.. మంగళవారం ఆప్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆప్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ 20 క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు.
మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో 4ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 22 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ కి ముందు రషీద్ ఖాన్ 112 వికెట్లతో ఉండటం గమనార్హం.
రషీద్ మొత్తంగా 68 మ్యాచుల్లో 115 వికెట్లు సాధించి న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని అధిగమించాడు. టిమ్ సౌథీ ఖాతాలో 114 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రషీద్ ఖాన్ కంటే ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీల్ అల్ హసన్ 122 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.