
క్రికెటర్‌గా కంటే కామెంటేటర్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్. మ్యాచ్ అనాలసిస్ చేసే సమయంలో క్రికెట్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు చేయాల్సినదంతా చేస్తాడు డానీ మోరిసన్...
ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2023 సీజన్ కవరేజ్ కోసం పాక్‌లో ఉన్నాడు డానీ మోరిసన్. క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో డానీ మోరిసన్ చేసిన ఓ పని, ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది..
క్రికెటర్లు, స్పోర్ట్స్ యాంకర్లను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. టాప్ క్రికెట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న మయంతి లాంగర్‌ని క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ ప్రేమించి పెళ్లాడాడు. భారత క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా, యాంకర్ సంజన గణేశన్‌తో కొన్నేళ్ల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి, వివాహం చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కట్టింగ్ కూడా స్పోర్ట్ యాంకర్ ఎరిన్ హోలాండ్‌ని పెళ్లాడాడు...
ఎరిన్ హోలాండ్ కూడా ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో ఉంది. ప్రీ మ్యాచ్ కవరేజ్ సమయంలో తన పక్కనే ఉన్న ఎరిన్ హోలాండ్‌ని అకస్మాత్తుగా అలా ఎత్తేశాడు డానీ.. ఏదో పాట పాడుతూ ఆమె పక్కనే వచ్చిన డానీ మోరిసన్.. ‘మిసెస్ కట్టింగ్’ అంటూ ఆమె నడుముపై చేయి వేసి పైకి లేపేశాడు...
ఈ సంఘటనతో ఆమె షాకైన నవ్వేసింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఎరిన్ హోలాండ్... ‘లవ్ యా అంకుల్’ అంటూ డాన్ మోరిసన్‌ని ట్వాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. దీనికి డానీ మోరిసన్ కూడా స్పందించాడు...
‘మిమ్మల్ని మీ కాళ్లపై పెడుతున్నా మిసెస్ కట్టింగ్...’ అంటూ రిప్లై ఇచ్చాడు డానీ మోరిసన్. ఈ మొత్తం ఎపిసోడ్‌పై క్రికెటర్ బెన్ కట్టింగ్ ఏ విధంగా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కామెంటేటర్‌గా మారిన తర్వాత డానీ మోరిసన్ ఇలా స్పోర్ట్స్ యాంకర్లను పైకి లేపి వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించిన డానీ మోరిసన్, ఓ ఛీర్ లీడర్‌ని తన భుజాలపైన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో చాలా పెద్ద దుమారం రేపింది...
అయితే మరో ఐపీఎల్ యాంకర్ కరిష్మా కోటక్‌ని కూడా ఇదే విధంగా నడుముపై చేయి వేసి పైకి ఎత్తేశాడు డానీ మోరిసన్. ఈ సమయంలో కరిష్మా కోటక్ కాస్త ఇబ్బందిపడడం లైవ్ టీవీల్లో కనిపించింది..