రూ. 10 కోట్లు పెట్టి కొని, పక్కన పెట్టారెందుకు? ఆశ్చర్యంలో క్రికెట్ ఫ్యాన్స్...

By team teluguFirst Published Sep 22, 2020, 5:35 PM IST
Highlights

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ. 10 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్...

హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బరిలో దిగని క్రిస్ మోరిస్....

కారణం ఇదేనంటున్న క్రికెట్ విశ్లేషకులు...

ఐపీఎల్.. సత్తా ఉన్న క్రికెటర్ల కోసం ఆశగా ఎదురుచూసే వేదిక. టాలెంట్ ఉన్నోడు కనిపిస్తే, ఎన్ని కోట్లు పెట్టి కొనేందుకైనా సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైసీలు. ఈ సీజన్ వేలంలో కూడా కొందరు క్రికెటర్లకు కాసుల పంట పండింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

డేల్ స్టెయిన్ తప్ప స్టార్ పేసర్ లేని బెంగళూరుకి క్రిస్ మోరిస్ బాగా ఉపయోగపడతారని భావించారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మోరిస్ బరిలో దిగకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నవ్‌దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్ వంటి పేసర్లతోనే బరిలో దిగిన బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సన్‌రైజర్స్ మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం వల్ల బెంగళూరుకి విజయం దక్కింది కానీ మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మెన్ ఒక్కరు రాణించినా రిజల్ట్ మారిపోయేది. మరి డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన మోరిస్‌ను కోహ్లీ ఎందుకు ఆడించలేదన్నది విరాట్ ఫ్యాన్స్‌ను వేధిస్తున్న ప్రశ్న.

అయితే క్రిస్ మోరిస్‌ను ఓ అస్త్రంగా వాడాలని భావిస్తున్న కోహ్లీ సేన, కీలక మ్యాచులకి అందుబాటులో ఉండేందుకు మొదటి మ్యాచ్‌లో అతనికి రెస్టు ఇచ్చిందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలని ఫిక్స్ అయిన బెంగళూరు, క్రిస్ మోరిస్‌ను ఎలా వాడాలనే విషయంలో చాలా క్లారిటీతో ఉందని అంటున్నారు విరాట్ ఫ్యాన్స్.

click me!