CSKvsKXIP: పంజాబ్‌ను ఆదుకున్న దీపక్ హుడా... చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఈజీ టార్గెట్..

By team teluguFirst Published Nov 1, 2020, 5:15 PM IST
Highlights

హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన దీపక్ హుడా...

29 పరుగులు చేసిన కెఎల్ రాహుల్... 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్...

మొదటి వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం... తీవ్రంగా నిరాశపరిచిన క్రిస్ గేల్, నికోలస్ పూరన్...

మూడు వికెట్లు తీసిన లుంగి ఇంగిడి... 

IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ తడబడింది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్ 15 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారీ హిట్టర్ క్రిస్ గేల్ 19 బంతుల్లో 12 పరుగులు చేయగా... ‘బాస్’ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా ఉండకపోవడం విశేషం.

నికోలస్ పూరన్ కూడా 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ దశలో మన్‌దీప్ సింగ్, దీపక్ హుడా కలిసి ఐదో వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే మన్‌దీప్ అవుటైన తర్వాత వికెట్ల పతనం కొనసాగింది.

మన్‌దీప్ 14, నీషమ్ 2 పరుగులు చేసి అవుట్ కాగా దీపక్ హుడా 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది పంజాబ్... చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో లుంగి ఇంగిడి మూడు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేజా తలా వికెట్ తీశారు.

click me!