CSKvsKKR: నితీశ్ రాణా అద్భుత హాఫ్ సెంచరీ... చెన్నై ముందు భారీ టార్గెట్...

Published : Oct 29, 2020, 09:06 PM IST
CSKvsKKR: నితీశ్ రాణా అద్భుత హాఫ్ సెంచరీ... చెన్నై ముందు భారీ టార్గెట్...

సారాంశం

నితీశ్ రాణా మరో హాఫ్ సెంచరీ... కార్తీక్, మోర్గాన్, శుబ్‌మన్ గిల్ మెరుపులు...      

IPL 2020: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా కలిసి మొదటి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. శుబ్‌మన్ గిల్ తన స్టైల్‌కి భిన్నంగా దూకుడుగా ఆడి 17 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ కాగా... సునీల్ నరైన్ 7, రింకూ సింగ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన నితీశ్ రాణా... 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నితీశ్ రాణాకి ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇయాన్ మోర్గాన్ 15, దినేశ్ కార్తీక్ 21 పరుగులు చేయడంతో మంచి స్కోరు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇంగిడి రెండు వికెట్లు తీయగా జడేజా, కర్న్ శర్మ, సాంట్నర్ తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది