IPL 2020: విరాట్ చేసిన పనికి సూర్యకుమార్ యాదవ్ ‘కూల్’ సమాధానం... వీడియో వైరల్...

Published : Oct 29, 2020, 05:36 PM IST
IPL 2020: విరాట్ చేసిన పనికి సూర్యకుమార్ యాదవ్ ‘కూల్’ సమాధానం... వీడియో వైరల్...

సారాంశం

43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.... అసహనంతో సూర్యకుమార్ యాదవ్‌పై నోరుపారేసుకున్న విరాట్ కోహ్లీ... వీడియో వైరల్...

IPL 2020: విరాట్ కోహ్లీ అంటేనే చాలా కోపిష్టి, ఆవేశపరుడు, ఎమోషనల్, ఓవర్ రియాక్టర్... ఇలా ఎన్నో సమాధానాలు వినిపిస్తాయి. బ్యాటుతో టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ చేస్తూ ‘రన్ మెషిన్’గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, తన దూకుడైన ప్రవర్తన కారణంగా అంతే సంఖ్యలో శత్రువులను కూడా సంపాదించుకున్నాడు.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన దూకుడైన వ్యక్తిత్వంతో వార్తల్లో నిలిచాడు విరాట్.165 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్, తన అద్భుత ఇన్నింగ్స్‌తో వన్ సైడ్ విక్టరీ అందించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.

ఎంత మంది బౌలర్లను మారుస్తున్నా సూర్యకుమార్ యాదవ్ అవుట్ కాకపోవడంతో అసహనానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ. యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ. దీంతో కోపంగా చూస్తూ వచ్చి... సూర్యకుమార్ యాదవ్‌ను సెడ్జింగ్ చేశాడు.

 

 

అయితే తన ఫేవరెట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ తనని తిడుతున్నా... సూర్యకుమార్ యాదవ్ కూల్‌గా బబుల్ గమ్ నములుతూ నించున్నాడు కానీ ఎదురు మాట్లాడలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు