అప్పటి దాకా నాతో ఉన్నాడు.. 19.29కి వీడ్కోలు చెప్పాడు, షాకయ్యా: లక్ష్మీపతి బాలాజీ

By Siva KodatiFirst Published Aug 23, 2020, 4:15 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆగస్టు 15న చాలా కూల్‌గా రిటైర్మెంట్‌‌ ప్రకటించాడు. అయితే తనతో అప్పటి దాకా వున్న వ్యక్తి ఈ నిర్ణయం ప్రకటించడంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్, భారత మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ షాక్‌కు గురయ్యాడు. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆగస్టు 15న చాలా కూల్‌గా రిటైర్మెంట్‌‌ ప్రకటించాడు. అయితే తనతో అప్పటి దాకా వున్న వ్యక్తి ఈ నిర్ణయం ప్రకటించడంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్, భారత మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ షాక్‌కు గురయ్యాడు.

ఆ రోజు జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకుంటూ... యూఏఈలో జరగనున్న ఐపీఎల్ కోసం చెన్నై యాజమాన్యం చిదంబరం స్టేడియంలో క్యాంప్‌ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 15న జరిగిన ప్రాక్టీస్‌కు ధోనీ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా వికెట్ గురించి, ప్రాక్టీస్ జరుగుతున్న దానిపై బాలాజీ, మహీ మాట్లాడుకున్నారు. సాయంత్రం ప్రాక్టీస్ ముగించుకుని ఇద్దరూ ఎవరి గదుల్లోకి వచ్చారు. అయితే రాత్రి 7.29 గంటలకు తన రిటైర్మెంట్ సందేశాన్ని ధోనీ ముందుగా సిద్ధం చేసుకుని ఉంటాడని తాను ఊహించలేకపోయానని బాలాజీ అన్నాడు.

సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసిన తర్వాత ధోని ఎప్పటిలాగే చాలా ప్రశాంతంగా తన వద్దకు నడుచుకుంటూ వచ్చాడని బాలాజీ చెప్పాడు. ఈ సమయంలో పిచ్‌ను ఎక్కువగా నీటితో తడపాలని గ్రౌండ్స్‌మన్‌ను కోరాడు.

చివరికి ధోనీ రిటైర్మెంట్ చెప్పినట్లు తాను గ్రహించానని బాలాజీ తెలిపాడు. దాని నుంచి తేరుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని.. ఇదే ధోనీ యొక్క ప్రత్యేకత అన్న బాలాజీ, పరిస్ధితులు ఎలా వున్నా ఆయన తనదైన శైలిలో ముందుకు సాగిపోతాడని చెప్పాడు.

కాగా 2018 నుంచి లక్ష్మీపతి బాలాజీ సీఎస్కే‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ కెప్టెన్సీలో చివరిసారిగా 2012లో టీమిండియా తరపున ఆడిన బాలాజీ, సీఎస్‌కే తరపున కూడా ఆడాడు.

తన ఉద్దేశ్యంలో 2000వ సంవత్సరం నుంచి ధోనీ భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌పై ప్రభావం చూపాడని బాలాజీ అభిప్రాయపడ్డాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చివరి ఓవర్‌లో 20 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి వస్తే, తాను ఎవరినైనా ఎంచుకోవాల్సి  వస్తే అది ధోనీ అవుతాడని ఆయన ప్రశంసించాడు. 

click me!