IPL: మరో ల్యాండ్ మార్క్ చేరిన సీఎస్కే, ఆర్సీబీ.. భారత్ లో కాదు..! ప్రపంచంలోనే తోపు రికార్డు సొంతం

By Srinivas MFirst Published Jan 12, 2022, 2:58 PM IST
Highlights

CSK  And RCB Reach Another Landmark: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో  మ్యాచులు గెలిచినా ఓడినా.. కప్పు కొట్టినా కొట్టకున్నా బెంగళూరు, చెన్నై అభిమానులు మాత్రం  వాళ్ల ఫ్రాంచైజీలపై చూపించే ప్రేమ అనన్య సామాన్యం. ఇప్పుడు ఈ రెండు జట్లు మరో అరుదైన ఘనతను సాధించాయి. 
 

ఐపీఎల్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని  చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ రెండు జట్లకు విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ మొదలై 14 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు కప్పు కొట్టకున్నా  ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి పట్ల గానీ ఆర్సీబీ పై గానీ ఆ జట్టు అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. ఇక ఎంఎస్ ధోనితో చెన్నై కి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఆ  జట్టు ఫ్రారంభం నుంచి ఇప్పటిదాకా ధోనియే చెన్నై సారథి. ఈ రెండు జట్లు ఇప్పుడు మరో ఘనత సాధించాయి. 

తాజాగా ఈ రెండు జట్లు మరో  అరుదైన ఘనతను సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా  సోషల్ మీడియాలో (జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31 2021 దాకా) అత్యధిక ఎంగేజ్మెంట్ (లైకులు, షేర్స్, కామెంట్స్ చేయడాన్ని ఇలా అంటారు)లు చేసిన భారత క్రీడా క్లబ్ లుగా నిలిచాయి.  ఈ ఏడాది ఆర్సీబీ 820 మిలియన్ల ఎంగేజ్మెంట్ లు చేయగా.. ఆ తర్వాత సీఎస్కే.. 752 మిలియన్ల మార్కును చేసింది. 

 

United, United top of the league - of total engagement on social media. Maybe no more need for the sentiment graphs pic.twitter.com/fL2p834UdM

— Samuel Luckhurst (@samuelluckhurst)

ఈ జాబితాలో ప్రముఖ ఫుట్ బాల్  క్లబ్ మాంచెస్టర్ యూనైటెడ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్లబ్ సోషల్ మీడియాలో ఏకంగా  2.6 బిలియన్ల ఎంగేజ్మెంట్ లు చేసింది. ఆ తర్వాత జాబితాలో ఉన్న ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా (2.3 బిలియన్స్), రియల్ మాడ్రిడ్ (1.3 బిలియన్స్), పారిస్  సెయింట్ జర్మన్ (1.2 బిలియన్స్), చెలెసె ఎఫ్సీ (1.2 బిలియన్స్), లివర్పూల్ ఎఫ్సీ (1.1 బిలియన్స్)  గలాటాసరే (857 మిలియన్స్) ఉన్నాయి. పదో స్థానంలో ఫ్లెమింగో (699 మిలియన్స్) ఉంది.
 
ఆర్సీబీ 8 వ స్థానంలో, సీఎస్కే తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ  టాప్-10 జాబితాలో సీఎస్కే,  ఆర్సీబీ తప్ప మిగిలినవన్నీ ఫుట్బాల్ క్లబ్ లే కావడం గమనార్హం. 

ఈ ఏడాది ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు ప్రవేశించనున్న విషయం తెలిసిందే. దీనికోసం గతేడాది నిర్వహించిన కొత్త జట్ల వేలం ప్రక్రియను చూసి చాలా మంది కళ్లగప్పించారు. ఇండియాలో  ప్రతి  యేటా జరిగే ఈ  లీగ్  లో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల కోసం వేల కోట్లు కుమ్మరించడానికి మరీ బడా పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేయలేదు. యూరప్ లో ఫుట్ బాల్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ కూడా  బిడ్ వేసేందుకు వచ్చిందంటే అది మాములు విషయం కాదు. ఇక ఐపీఎల్ ఎంతమాత్రమూ ఇండియాకు సంబంధించింది కాదని, అది విశ్వవ్యాప్తమైందని గతంలో బీసీసీఐ పెద్దలు  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

click me!