క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం... కరోనాతో సోదరి మృతి, అంతకుముందు తల్లి కూడా...

Published : May 06, 2021, 03:55 PM IST
క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం... కరోనాతో సోదరి మృతి, అంతకుముందు తల్లి కూడా...

సారాంశం

రెండు వారాల క్రితం కరోనాతో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి... తాజాగా ఆమె సోదరి కూడా... నెల రోజులుగా కోవిద్‌తో యుద్ధం చేస్తూ తుది శ్వాస విడిచిన వత్సల...

భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణామూర్తి ఇంట్లో పెను విషాదం నెలకొంది. కరోనా కారణంగా ఏకంగా ఇద్దరు కుటుంబీకులను కోల్పోయింది వేదా. కొన్నాళ్ల క్రిందట కరోనాతో పోరాడుతూ వేదా కృష్ణమూర్తి తల్లి ప్రాణాలు విడవగా, తాజాగా ఆమె సోదరి వత్సల శివకుమార్ కూడా ప్రాణాలు విడిచింది.

వత్సల నెల రోజులుగా కరోనాతో పోరాడుతోంది. గురువారం ఆరోగ్యం విషమించి, ఆమె ప్రాణాలు విడిచింది. రెండు వారాల క్రితం తల్లి, కోవిద్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది వేదా కృష్ణమూర్తి.

టీమిండియా తరుపున 48 వన్డేలు, 76 టీ20 మ్యాచులు ఆడిన వేదా కృష్ణమూర్తి, జట్టులో చలాకీగా ఉంటూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండేది. కరోనా సమయంలో అవసరమైనవారికి సోషల్ మీడియా ద్వారా తనకు వీలైన సాయం చేస్తోంది వేదా కృష్ణమూర్తి. అలాంటిది ఆమె ఇంట్లోనే కరోనా ఇద్దరి ప్రాణాలు తీసుకుంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది