
భారత లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా.. సోమవారం కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు పియూష్ చావ్లా.
‘బరువెక్కిన మనసుతో ఈ విషయాన్ని తెలియచేస్తున్నా. మా నాన్న ప్రమోద్ కుమార్ చావ్లా మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన కరోనాతో బాధపడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ రాసుకొచ్చాడు పియూష్ చావ్లా.
ఈ పోస్టుకి భారత క్రికెటర్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్ తదితరులు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నిన్న యువ క్రికెటర్ చేతన్ సకారియా తండ్రి కరోనాతో ప్రాణాలు విడవగా, కొన్నిరోజుల క్రితం మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తండ్రి, అక్క ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.