‘వారెవ్వా... క్యా క్యాచ్‌ హై...’ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న హర్లీన్ డియోల్... మొదటి టీ20లో...

Published : Jul 10, 2021, 09:39 AM IST
‘వారెవ్వా... క్యా క్యాచ్‌ హై...’  కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న హర్లీన్ డియోల్... మొదటి టీ20లో...

సారాంశం

మహిళల క్రికెట్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అందుకున్న భారత క్రికెటర్ హర్లీన్ డియోల్... తొలి టీ20లో ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టు విజయం... షెఫాలీ వర్మ డకౌట్, మరోసారి నిరాశపర్చిన హర్మన్‌ప్రీత్...

అబ్బాయిలతో పోలిస్తే మాకేం తక్కువ అన్నట్టుగా అమ్మాయిలు కూడా ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నారు. మొన్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో స్మృతి మందాన కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా, తాజాగా మొదటి టీ20 మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది.

27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్స్, శిఖా పాండే బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కి ప్రయత్నించింది. బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకున్న హర్లీన్ డియోల్, బ్యాలెన్స్ తప్పి పడిపోయే ముందు బాల్‌ను పైకి ఎగిరేసింది. ఆ వెంటనే మెరుపు వేగంతో వెనక్కి వచ్చి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది...

హర్లీన్ డియోల్ పట్టిన ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాస్ గెలిచి, ఇంగ్లాండ్ జట్టుకి మొదట బ్యాటింగ్ అప్పగించింది హర్మన్‌ప్రీత్ కౌర్. అయితే స్రీవర్ 55, జోన్స్ 43, వ్యాట్ 31 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

లక్ష్యచేధనలో రెండో బంతికే షెఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా. టీ20 నెం.1 బ్యాట్స్‌వుమెన్‌గా ఉన్న షెఫాలీ వర్మను బ్రంట్ క్లీన్‌బౌల్డ్ చేసింది. స్మృతి మందాన 17 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 1 పరుగుకే పెవిలియన్ చేరింది.

8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసిన దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లాండ్ జట్టు 18 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు అంపైర్లు...

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే