
క్రికెట్‌లో స్టార్ కామెంటేటర్‌గా ఎదిగిన హైదరాబాదీ హర్షా భోగ్లే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హర్షా భోగ్లేకి తెలుగు మాట్లాడడం కూడా బాగా వచ్చు. ఐపీఎల్ అయినా, ఐసీసీ ఈవెంట్ అయినా తప్పక కనిపించే హర్షా భోగ్లే... గరువారం క్రికెట్ ఫ్యాన్స్‌ని కాస్త కలవరపెట్టాడు...
ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ అనే ఛానెల్‌తో కలిసి ఐపీఎల్ 2022 సీజన్ లైవ్‌లో పాల్గొన్నాడు హర్షా భోగ్లే. అయితే లైవ్ జరుగుతున్న సమయంలో హర్షా భోగ్లే సడెన్‌గా స్క్రీన్‌లో నుంచి మాయం అయిపోవడం, తనపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో అందరూ షాక్ అయ్యారు. క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్ హోస్ట్, హర్షా భోగ్లేని ఏమైంది? మీ ఫోన్ పడిపోయిందా? అని అడగడం... దానికి కామెంటేటర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేపై ఎవరు దాడి చేశారు? ఆయనకి ఏమైందనే క్రికెట్ ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. దీన్ని మరింత పెంచుతూ క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్... ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరిగిందో మాకు తెలీదు.తెలుసుకునేందుకు హర్షా భోగ్లేతో, ఆయన టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం... త్వరలో మీకు సమాచారం ఇస్తాం’ అంటూ ట్వీట్ చేసింది..
అయితే హర్షా భోగ్లేపై దాడి నిజం కాదని, సదరు ప్రోగ్రామ్‌కి హైప్ తెచ్చేందుకు ఆ ఛానెల్... ప్లాన్ చేసి కట్ చేసిన ప్రోమో అని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వేలల్లో ఫోన్లు, మెసేజ్‌లు రావడంతో ఆశ్చర్యపోయిన హర్షా భోగ్లే... ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు...
‘నేను బాగానే ఉన్నా. మీలో చాలా మంది ఆ వీడియో చూసి కంగారుపడ్డారని అర్థమైంది. అందరినీ క్షమాపణలు కోరుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఆ వీడియో మేం అనుకున్నదాని కంటే ఎక్కువ వైరల్ అయ్యింది. ఇది నాకో పాఠం లాంటిది. మేం అనుకున్నది ఒకటి, జరిగిందొకటి... సారీ.. అండ్ ఛీర్స్...’ అంటూ ట్వీట్ చేశాడు హర్షా భోగ్లే...
ఆ తర్వాత ‘ప్రతీ రోజు ఓ కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. మేం కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, కంగారు పెట్టాలని ఇలా చేయలేదు. మేం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను చేసిన పనికి కాస్త సిగ్గుపడుతున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు హర్షా భోగ్లే...