క్రికెట్ ఆడాలంటే అది వేసుకోవాల్సిందే! రూల్స్ కఠినతరం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా...

By Chinthakindhi Ramu  |  First Published Sep 14, 2023, 4:24 PM IST

అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచులు ఆడాలనుకునే ప్రతీ ప్లేయర్‌కి హెల్మెన్ కింద నెక్ గార్డ్ (మెడ పట్టీ)  ధరించడం తప్పనిసరి... క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త రూల్..


క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఆస్ట్రేలియా. రికార్డు స్థాయిలో ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, 2021లో టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ప్లేయర్ల ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉండే క్రికెట్ ఆస్ట్రేలియా, నెక్ గార్డ్‌ని తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొచ్చింది..

కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచులు ఆడాలనుకునే ప్రతీ ప్లేయర్ కూడా హెల్మెన్ కింద నెక్ గార్డ్ (మెడ పట్టీ) వేసుకోవాల్సిందే. అంటే అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ మెడ పట్టీ వేసుకుని ఆడాల్సిందే..

Latest Videos

undefined

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కామెరూన్ గ్రీన్‌ మెడకి గాయమైంది. కగిసో రబాడా వేసిన బౌన్సర్ నేరుగా కామెరూన్ గ్రీన్ మెడ దగ్గర తగిలింది. గ్రీన్ ధరించిన హెల్మెట్‌కి నెక్ గార్డ్ ఉండడం వల్ల తీవ్ర గాయం కాలేదు కానీ లేదంటే రబాడా వేసిన బౌన్సర్ దెబ్బకి గ్రీన్ ప్రాణాలకు ప్రమాదం కలిగి ఉండేది..

దీంతో ఇకపై ఆస్ట్రేలియా క్రికెటర్ల అందరూ నెక్ గార్డ్ తప్పనిసరిగా ధరించాలని నియమం పెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఈ నిర్ణయం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి సీనియర్ ఆస్ట్రేలియా ప్లేయర్లపై ప్రభావం చూపించవచ్చు. 

ఈ ఇద్దరితో పాటు ఉస్మాన్ ఖవాజా కూడా నెక్ గార్డ్ లేని హెల్మెట్లను వాడుతున్నారు. నెక్ గార్డ్ పెట్టుకోవడం వల్ల ఫ్రీగా మెడకు తిప్పలేకపోతున్నామని, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించారు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్..

ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్‌, క్రికెట్ ఆడుతూ బౌన్సర్ బలంగా మెడకు తగలడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచే ప్లేయర్ల హెల్మెన్ వెనక నెక్ గార్డ్ ధరించాలని సూచిస్తూ వచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది..

ఒకవేళ ఏ ప్లేయర్ అయినా మెడ పట్టీ లేకుండా బ్యాటింగ్ చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కామెరూన్ గ్రీన్ గాయపడడంతో అతని ప్లేస్‌లో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లబుషేక్ బ్యాటింగ్‌కి వచ్చాడు..

80 పరుగులు చేసి, ఆస్ట్రేలియాకి ఘన విజయాన్ని అందించాడు. ఆ తర్వాత రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన లబుషేన్, వన్డే టీమ్‌లో సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు. కామెరూన్ గ్రీన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ సమయానికి కోలుకోకపోతే అతని ప్లేస్‌లో మార్నస లబుషేన్, ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది..
 

click me!