సీపీఎల్ 2021 టైటిల్ గెలిచిన డీజే బ్రావో టీమ్... ఫైనల్‌లో ప్రీతీ జింటా టీమ్‌కి...

By Chinthakindhi RamuFirst Published Sep 16, 2021, 9:21 AM IST
Highlights

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ 2021 టైటిల్‌ కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రావో కెప్టెన్సీలోని ఎస్‌టీ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియట్స్ టీమ్ విజేతగా నిలిచింది... 

కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది... కార్న్‌వాల్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, రోస్టన్ ఛేజ్ 40 బంతుల్లో 43 పరుగులు, కీమో పాల్ 21 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 

160 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఎస్‌టీ కి అండ్ నేవీస్ పాట్రియట్స్ జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో డొమినిక్ డ్రాక్స్, ఫ్యాబియన్ ఆలెన్ పోరాటంతో మ్యాచ్ ఆఖరి వరకూ వెళ్లింది. ఆఖరి మూడు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో ఓ ఫోర్, రెండు పరుగులు, ఆఖరి బంతికి సింగిల్ తీసిన డ్రాక్స్... నేవీస్ జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు...

గత సీజన్‌లో 10 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న నేవీస్ పాట్రియట్స్ జట్టు, ఈ ఏడాది టైటిల్ విజేతగా నిలిచింది...గత సీజన్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన టైటిల్ అందించిన డీజే బ్రావో, ఈ ఏడాది కిట్స్ అండ్ నేవీస్ జట్టుకి కెప్టెన్‌గా మారి టైటిల్ అందించడం విశేషం...

కెప్టెన్‌గా బ్రావోకి ఇది నాలుగో సీపీఎల్ టైటిల్ కాగా... ప్లేయర్‌గా తన కెరీర్‌లో 15వ టీ20 టైటిల్. అత్యధిక టీ20 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కిరన్ పోలార్డ్ రికార్డును సమం చేశాడు డీజే బ్రావో..

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ యజమానిగా టైటిల్ గెలవలేకపోయిన ప్రీతి జింటా, సీపీఎల్‌లోనూ టైటిల్ సాధించలేకపోయింది. ఫైనల్‌లో బ్రావో టీమ్ చేతుల్లో ఓడిన సెయింట్ లూసియా కింగ్స్‌కి ప్రీతి జింటాయే సహ యజమాని...

click me!