ధోని, రైనాల మధ్య రూం కోసం వాగ్యుద్ధం: బయటపెట్టిన చెన్నై ఓనర్ శ్రీని

By team teluguFirst Published Aug 31, 2020, 4:10 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓనర్, మాజీ బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసం వ్యాఖ్యలు వింటే మాత్రం ధోనికి రైనాకు మధ్య హోటల్ రూమ్ విషయంలో గొడవ జరిగినట్టు, దానికి నొచ్చుకున్న రైనా తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ధోని తరహాలో తనకు సైతం బాల్కనీ కలిగిన హోటల్ రూమ్ నే ఇవ్వాలని రైనా పట్టుబట్టినట్టుగా చెబుతున్నారు. 

సురేష్ రైనా ఐపీఎల్ నుండి నిష్క్రమించడం పై రోజుకో కొత్త వాదన వినబడుతుంది. తొలుత బంధువుల మరణం రైనాను కలిచివేసింది అని ఊహాగానాలు వినిపించగా.... తరువాత రైనా కరోనా వైరస్ వల్ల భయభ్రాంతులకు గురై తన కుటుంబమే కావాలనుకొని వెనక్కి తిరిగివచ్చినట్టు వార్తలు వచ్చాయి. 

కానీ ఇందాక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓనర్, మాజీ బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసం వ్యాఖ్యలు వింటే మాత్రం ధోనికి రైనాకు మధ్య హోటల్ రూమ్ విషయంలో గొడవ జరిగినట్టు, దానికి నొచ్చుకున్న రైనా తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ధోని తరహాలో తనకు సైతం బాల్కనీ కలిగిన హోటల్ రూమ్ నే ఇవ్వాలని రైనా పట్టుబట్టినట్టుగా చెబుతున్నారు. 

తనకు బాల్కని ఉన్న రూమ్ కావాలని పట్టుబట్టిన రైనా అందుకోసం వాగ్విదానికి కూడా దిగినట్టు తెలియవస్తుంది. దుబాయ్ కి చేరుకున్న తరువాత ప్లేయర్స్ అంతా రూంలకు మాత్రమే పరిమితమై ఉండాలన్న నిబంధన ఉండడంతో... రైనా తీవ్రంగా ఇబ్బ్నది పది... ధోనికి ఇచ్చినట్టుగా బాల్కనీ ఉన్న రూమ్ ని ఇవ్వవలిసిందిగా రైనా కోరాడు. 

ఇక టీంలోని ఇద్దరు ప్లేయర్స్ సహా 13 మందికి కరోనా సోకడంతో... అప్పటికే అసంతృప్తిగా ఉన్న రైనా కు భయం కూడా తోడవడంతో ఐపీఎల్ వద్దంటూ ఇంటికి బయల్దేరాడు. రైనా టెంపరమెంట్ రైనాను వెనక్కి వెళ్లేలా చేసిందని శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు. 

చెన్నై టీంలోని అందరూ ఒకటిగా ఉంటారని, రైనా వాటిని పక్కకు తోసేసి వెళ్లిపోవాలని  అడ్డుపడరని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. గెలుపు రైనా తలకెక్కిందని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మరింతమందికి వచ్చినప్పటికీ... ఎవరూ భయపడాల్సిందేమీ లేదని ధోని చెప్పినట్టుగా శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు. 

జరిగిన సంఘటన పట్ల ధోని చాలా స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడని ఈ సందర్భంగా శ్రీనివాసన్ పేర్కొన్నాడు. 

click me!