ఐపీఎల్ కోసం తెగ కష్టపడుతున్న రిషబ్ పంత్.. హోటల్ రూంలోనే స్టంట్లు

Siva Kodati |  
Published : Aug 30, 2020, 03:16 PM IST
ఐపీఎల్ కోసం తెగ కష్టపడుతున్న రిషబ్ పంత్.. హోటల్ రూంలోనే స్టంట్లు

సారాంశం

ఐపీఎల్ 13వ సీజన్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఈఏ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆటగాళ్లందరూ భారీగానే సిద్ధమవుతున్నారు

ఐపీఎల్ 13వ సీజన్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఈఏ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆటగాళ్లందరూ భారీగానే సిద్ధమవుతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా నాలుగు గోడలకే పరిమితమైన క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా తయారవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ హోటల్ రూంలో స్టంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న ఆయన బ్యాక్‌గ్రౌండ్ పాటతో స్టంట్లు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను పంత్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

‘‘ లాక్‌డౌనే కానీ, ఛార్జ్ అవుతున్నా.. రిషబ్ పంత్... రిషబ్ స్టంట్’’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఐపీఎల్ కోసం అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. బీసీసీఐతో పాటు యూఏఈ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. నాటి నుంచి ఎవరికి వారు హోటల్ గదికి పరిమితమైపోయారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు