ఇండియాతో సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గేల్ గుడ్ బై

By telugu teamFirst Published Jun 26, 2019, 6:02 PM IST
Highlights

ప్రస్తుతం క్రిస్ గేల్ ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతున్నాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో తాను ఆడడం ప్రపంచ కప్ పోటీలే చివరివి అవుతాయని గేల్ ఫిబ్రవరిలో చెప్పాడు. అయితే, మనసు మార్చుకుని ఇండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. 

మాంచెస్టర్: వెస్టిండిసీ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడు. స్వదేశీ గడ్డపై ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. 

ప్రస్తుతం క్రిస్ గేల్ ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతున్నాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో తాను ఆడడం ప్రపంచ కప్ పోటీలే చివరివి అవుతాయని గేల్ ఫిబ్రవరిలో చెప్పాడు. అయితే, మనసు మార్చుకుని ఇండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. 

"ఇంకా సమాప్తం కాలేదు. ఇంకా నేను కొన్ని గేమ్స్ ఆడుతాను. బహుశా మరో సిరీస్ అడవచ్చు. ఏమవుతుందో ఎవరికి తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం" అని అన్నాడు. ప్రపంచ కప్ పోటీల తర్వాత ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ లో తాను ఆడవచ్చునని అన్నాడు. ఇండియా జరిగే వన్డేల్లో తప్పకుండా ఆడుతానని చెప్పాడు. ట్వంటీ20 మ్యాచులు మాత్రం ఆడబోనని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ పోటీల తర్వాత తన ప్లాన్ అదీ అని చెప్పాడు. 

వెస్టిండీస్ తో భారత్ మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు, ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచులు ఆడుతుంది. ఇండియాతో జరిగే సిరీస్ గేల్ కు చివరి అంతర్జాతీయ మ్యాచులు కావచ్చునని వెస్టిండీస్ మీడియా మేనేజర్ ఫిలిప్ స్పూనర్ అన్నాడు. ఇండియాతో గేల్ చివరి సిరీస్ ఆడుతాడని చెప్పారు. 

click me!