‘హండ్రెడ్ లీగ్’లో ఇంటర్నేషనల్ స్టార్స్.. ఆసక్తి చూపుతున్న వార్నర్, బాబర్, గేల్.. ఈనెల 5న వేలం

Published : Apr 01, 2022, 04:31 PM IST
‘హండ్రెడ్ లీగ్’లో ఇంటర్నేషనల్ స్టార్స్.. ఆసక్తి చూపుతున్న వార్నర్, బాబర్, గేల్.. ఈనెల 5న వేలం

సారాంశం

The Hundred League: ఇంగ్లాండ్  వేదికగా నిర్వహిస్తున్న హండ్రెడ్ లీగ్ 2022 సీజన్ కు సర్వం సిద్ధమవుతున్నది. తొలి సీజన్ లో ఈ  లీగ్ ను అంతగా పట్టించుకోని అంతర్జాతీయ ఆటగాళ్లు.. ఇప్పుడు మాత్రం అందులో మెరిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ కు వస్తున్న ఆదరణను చూసి కన్నుకొట్టి ఇంగ్లాండ్ తీసుకొచ్చిన కొత్త క్రికెట్ లీగ్ ‘ది హండ్రెడ్’. గతేడాదే ఈ సీజన్ కు కొబ్బరి కాయ కొట్టారు. అయితే తొలి సీజన్ లో పెద్దగా ప్రాముఖ్యం పొందని  ఈ లీగ్ లో.. సెకండ్ సీజన్ కు మాత్రం అంతర్జాతీయ స్టార్లు క్యూ కట్టే అవకాశముంది.  ఈనెల 5న  ఇంగ్లాండ్ లో  హండ్రెడ్ లీగ్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ  నేపథ్యంలో బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఆండ్రీ రసెల్ వంటి ఆటగాళ్లు  వేలానికి పేర్లు కూడా నమోదు చేసుకున్నట్టు సమాచారం. 

గతేడాది దేశవాళీ ఆటగాళ్లతో పాటు పలువురు ఇతర దేశ ఆటగాళ్లతో నడిచిన హండ్రెడ్ లీగ్ లో ఈసారి భారీగా విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశముంది.  ఈసారి వేలంలో 16 దేశాల నుంచి సుమారు 284 మంది వేలంలో  పాల్గొనే అవకాశముంది. 

ఈ మేరకు హండ్రెడ్ లీగ్ లోని పలు ఫ్రాంచైజీలకు మార్గనిర్దేశాలు కూడా అందాయి.  రిటెన్షన్ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. ఆయా జట్లు 42 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వీరిలో 25 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు కాగా 17 మంది ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు. ఇప్పటివరకు ఈ లీగ్ లో ఆడేందుకు మొత్తంగా 534 మంది క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 284 మంది విదేశీ ఆటగాళ్లే కావడం విశేషం. 

 

హండ్రెడ్  వేలం ప్రక్రియలో భాగంగా  ఐదు స్లాబ్ లను తీసుకొచ్చారు. అందులో మొదటిది  రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ కాగా మిగిలినది రూ. 99 లక్షలు, రూ. 75 లక్షలు, రూ. 60 లక్షలు, రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు గా నిర్ణయించారు. 

రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ లో ఉన్న విదేశీ ఆటగాళ్ల జాబితా : 

బాబర్ ఆజమ్ (పాకిస్థాన్),  మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ (ఆసీస్), క్రిస్ గేల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్ (వెస్టిండీస్), షంషీ (దక్షిణాఫ్రికా) 

రూ. 99 లక్షల రిజర్వ్ ప్రైస్.. 

షకిబ్ అల్ హసన్, క్వింటన్ డికాక్, జై రిచర్డ్సన్, ఆండ్రీ రసెల్ 

రూ. 75 లక్షల రిజర్వ్ ప్రైస్.. 

మహ్మద్ అమీర్, డ్వేన్ బ్రావో, నాథన్ కౌల్టర్ నీల్, ఆరోన్ ఫించ్, షాదాబ్ ఖాన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, హరిస్ రౌఫ్, ఇమ్రాన్ తాహిర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 

రూ. 60 లక్షల రిజర్వ్ ప్రైస్.. 

సీన్ అబోట్, ఫిన్ అలెన్, హిట్మెయర్, మార్క్రమ్, పెహ్లుక్వాయో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ సాంట్నర్, ఒడియన్ స్మిత్, విల్ యంగ్, ఆడమ్ జంపా 

రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైస్.. 

అస్టన్ అగర్, అలెక్స్ కేరీ, మార్టిన్ గప్తిల్, వనిందు హసరంగ, హెన్రిక్స్, ఉస్మాన్ ఖవాజా, లబూషేన్, షోయభ్ మాలిక్, డారిల్ మిచెల్ , కొలిన్ మున్రో, జేమ్స్ పాటిన్సన్, భానుక రాజపక్స, రూథర్పర్డ్, మాథ్యూ వేడ్ 

రూ. 40 లక్షల రిజర్వ్ ప్రైస్.. 

క్రిస్ లిన్, తిసారా పెరీరా, దసున్ శనక, రొమారియో షెఫర్డ్,  లెండి సిమన్స్,  ఇమాద్ వసీం 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు