IPL2022: అతడితో బౌలింగ్ వేయించడం కరెక్ట్ కాదు.. చెన్నై ఓటమికి కారణం ఆ ఓవరే.. సీఎస్కే ఆల్ రౌండర్ పై సన్నీఆగ్రహం

Published : Apr 01, 2022, 03:44 PM IST
IPL2022: అతడితో బౌలింగ్ వేయించడం కరెక్ట్ కాదు.. చెన్నై ఓటమికి కారణం ఆ ఓవరే.. సీఎస్కే ఆల్ రౌండర్ పై సన్నీఆగ్రహం

సారాంశం

TATA IPL2022: గురువారం లక్నోతో జరిగిన మ్యాచులో  భారీ స్కోరు చేసినా చెన్నై సూపర్ కింగ్స్ కు ఓటమే ఎదురైంది. అయితే చెన్నై ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకుంటున్న  ఆ జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబే పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

లక్నోతో  గురువారం ముగిసిన మ్యాచులో  చెన్నై సూపర్ కింగ్స్ రెండువందలకు పైగా స్కోరు చేసినా గెలవలేకపోయింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో బ్యాటర్లు విజృంభించి ఆడటంతో సీఎస్కేకు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. అయితే చెన్నై ఓటమికి  కారణంగా భావిస్తున్న ఆ జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబే ఓవర్ పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసలు ఆ ఓవర్ అతడికి ఇవ్వకుండా ఉండాల్సిందని సునీల్ గవాస్కర్ అనగా.. చెన్నైకి వేరే ఆప్షన్లు లేవని అందుకే దూబే తో వేయించారని  ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. 

అప్పటికే ఉత్కంఠగా సాగుతున్న మ్యాచులో విజయం రెండు జట్లకు సమాన అవకాశాలు కల్పించినప్పటికీ  19వ ఓవర్ వేసిన దూబే.. ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులిచ్చాడు. దాంతో  అప్పటివరకు 12 బంతుల్లో 34 పరుగులు కావాల్సి ఉంది.  అయితే 19వ ఓవర్ వేసిన దూబే ఆ ఓవర్లో 25 పరగులిచ్చాడు.  ఈ ఓవర్లో అతడు రెండు వైడ్లతో  కలిపి మొత్తంగా 8 బంతులేశాడు. 

ఇదిలాఉండగా దూబే బౌలింగ్ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... ‘అతడు గతంలో టీ20 క్రికెట్ ఆడాడు. అయినప్పటికీ అతడి బౌలింగ్ లో మార్పు రావడం లేదు. అయినా  మ్యాచులో అప్పటివరకు బౌలింగ్ వేయని దూబేతో 19వ ఓవర్ వేయించడమనేది బెటర్ ఛాయిస్ కాదు. అప్పటికీ లక్నో బ్యాటర్లు షాట్లతో బెంబేలెత్తిస్తున్నారు.  

 

ఈ క్రమంలో బౌలింగ్ కు వచ్చిన దూబే లెంగ్త్ బంతులు విసిరినా అవి కాస్తా స్లో  డెలివరీలు. అయితే టర్నింగ్, డ్రై పిచ్ మీద స్లో డెలివరీలు భాగా ఉపయోగపడతాయేమో గానీ బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పై  మాత్రం అవి వేయడం బుద్దితక్కువ పనే అవుతుంది...’ అని వ్యాఖ్యానించాడు. 

 

ఇక ఇదే విషయమై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... ‘వాళ్ల (చెన్నై) కు ఎక్కువ ఆప్షన్లు లేవు. జడేజా లేదంటే మోయిన్ అలీ ఉన్నారు. కానీ పిచ్ పరిస్థితిని బట్టి ఫాస్ట్ బౌలర్ ను పంపాలి. దాంతో జడేజా కూడా దూబేకు బంతినిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో పనికివస్తాడనే కదా ఫ్రాంచైజీలు దూబే వెంట పడేది. అయితే దూబే మాత్రం కీలక పరిస్థితుల్లో మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. అయితే పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు. అందుకే తీవ్ర ఒత్తిడి ఎదుర్కుని  బోల్తా కొట్టాడు...’  అని చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !